Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.07.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 18-Jul-2021

దిన ధ్యానము(Telugu) 18.07.2021 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

మాట్లాడే దేవుడు

 

"హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు" - మత్తయి 5:8

 

హాయ్ పిల్లలు ఎలవున్నారు? మీ ఇంట్లో అన్నయ్య, అక్క, తమ్ముడు, చెల్లి ఎవరైనా ఉన్నారా? వారితో ఆడుతూ, పాడుతూ గోడవపడుతు, సమాధాన పడుతు మీ ఇల్లు కలకలగా ఉంటుంది కదా? కాని మీలాంటి పిల్లలు లేని ఇల్లు ఎలా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది. ఇలాగే హన్నా ఆంటీ ఇల్లు కాళిగా ఉండేది. తనకు పిల్లలు లేరు అని చాలా బాధపడ్డారు. ఆమె యెహోవా సన్నిధికి వెళ్లి కన్నీటితో ప్రార్ధించే వారు. ప్రభువా మీరు నాకు ఒక కుమారుడ్ని ఇస్తే వాడిని తిరిగి మీకే ఇస్తాను అని మ్రొక్కుబడి చేసి ప్రార్ధనను ముగించారు. ప్రార్ధించిన తరువాత పిల్లలు లేరు అని తలంచి బాధపడలేదు. 

 

దేవుడు ఆమె ప్రార్ధనను విని ఒక మంచి మగ బిడ్డను ఇచ్చారు. ఆ బిడ్డను హన్నా చాలా ప్రేమించింది. ఆ బిడ్డ యొక్క నాన్న అయిన ఎల్కానా తనను చాలా ముద్దుగా చూసుకునేవారు. వానికి సమూయేలు అని పేరుపెట్టారు. పిల్లవాడు పెరిగినప్పడు దూరంగా ఉన్న సిలోహులో తాను ప్రార్ధించిన దేవుని సన్నిధికి సమూయేలును తీసుకువెళ్లారు. ఆ సన్నిధిలో ఉంటున్న ఏలి తాతయ్య దగ్గర వదిలి పెట్టి యెహోవా యొద్ద చేసిన మ్రొక్కుబడిని నెరవేర్చారు. ఏలి తాతయ్య సమూయేలును బాగా చూసుకున్నారు. సమూయేలు దేవుని సన్నిధి యొక్క తలుపులు, కిటికీలు తుడుస్తు, ఆరాధనకు చాపలు వేయుచు తాతయ్య చెప్పిన అన్ని పనులను సంతోషంగా చేస్తూ వచ్చాడు. ఒక రోజు రాత్రి సమూయేలు పడుకున్నప్పుడు ఎవరో సమూయేలు అని పిలిచినట్లు అనిపించింది. తాను లేచి ఏలి తాతయ్య దగ్గరకు వెళ్లి నన్ను పిలిచారు అని అడిగాడు అందుకు ఏలి తాతయ్య నేను పిలవలేదు వెళ్లి పడుకో అన్నారు ఏలి తాతయ్య. రెండవ సారి, మూడవ సారి కూడా అలాగే సమూయేలు అని ఎవరో పిలిచినట్లు వినపడింది. మరల ఏలి తాతయ్య యొద్దకు వెళ్లి తాతయ్య పిలిచారా అని అడిగాడు. నేను పిలువ లేదు అని చెప్పి తాతయ్య ఆలోచించారు. యెహోవాయే అతనిని పిలుస్తున్నారు అని గ్రహించి తిరిగి ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు అలకించు చున్నాడు ఆజ్ఞను ఇమ్మని చెప్ప మనెను. సమూయేలు వెళ్లి పడుకున్నాడు మరల సమూయేలు, సమూయేలు అని పిలిచిన వెంటనే సమూయేలు లేచి ని దాసుడు అలకించు చున్నాడు ఆజ్ఞ ఇమ్మని దేవునితో మాట్లాడాడు. ఆ స్థలంలో జరగబోయే చాలా విషయాలను గురించి యెహోవా సమూయేలుతో మాట్లాడారు. 

 

పిల్లలారా! మీతో యేసయ్య మాట్లాడాలి అని ఆశగా ఉందా? నీవు యేసయ్య స్వరము విన గలవు ఎప్పుడో తెలుసా? నీ జీవితం పరిశుద్ధముగా సమూయేలు వలె యేసయ్య ఎదుట, మనుష్యుల ఎదుట ప్రియముగా నడుచుకున్నప్పుడు యేసయ్య యొక్క స్వరాన్ని విన గలవు. 

- శ్రీమతి. జీవ విజయ్

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet