By Village Missionary Movement
Saturday, 17-Jul-2021దిన ధ్యానము(Telugu) 17.07.2021 (Bible Characters Special)
షూనేమియురాలు
"ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును" - మత్తయి 10: 41
షూనేము ఇది ఆ స్త్రీ పేరు కాదు ఇది ఆమె నివసిస్తున్న ఊరు పేరు. దైవజనుడైన ఏలీషా ఆ ఊరికి వెళ్లినప్పుడు అతనిని తన ఇంటికి వచ్చి భోజనము చేయమని బలవంతము చేసేను. అలాగే అతను ప్రయాణము చేసి వచ్చినప్పుడల్లా అతనిని చుచు కొనుచు వచ్చెను. అది మాత్రమే కాదు ఆయన బస చేయుటకు ఒక చిన్న గడికూడా కట్టెను. ఆయనకు అవసరమైన అన్నింటిని అక్కడే ఏర్పాటు చేసింది. ఆమె యొక్క సంరక్షణ మంచి ఆతిధ్యం చూసిన ఏలీషా ను ఆమెకు ఏదైనా చెయ్యాలి అని ఆలోచనను కలిగించింది. నీవు మయందు ఇంత శ్రద్ధ భక్తి మయందు కనపరచితివి నేను నీకు ఏమి చెయ్యాలి? నీ కొరకు రాజుతో ని కొరకు మాటలడవలెనని నీవు కోరుతున్నవా? అని అడిగారు. కాని ఆమె తనకు పిల్లలు లేరు అనే లోటు బయలు పరచక నేను నా స్వజనములో కాపురం ఉన్నాను అనేను. ఏ ఒక్క ప్రతి ఫలం వారి యొద్ద నుండి ఆశించి వారిని సంరక్షణ చేయలేదు అనేది మనకు అర్ధం అవుతుంది.
దైవజనుడు ఆమె యొక్క పతిస్థితిని తెలుసుకొని దైవజనుడు ఆమెను ఆశీర్వదించగా ఆమె ఒక కుమారుణ్ణి పొందుకుంది. ఆ కుమారుడు ఎదుగుతున్నప్పుడు వ్యాధి వలన మృతిపొందెను. అది ఆమె హృదయమును కఠినముగా బాధించిన విశ్వసి బాధించబడడు అనే వచనం ద్వారా దానిని తన భర్తకు తెలియపరచ కుండా తన కుమారుడ్ని ఏలీషా యొక్క మంచం మీద పడుకోబెట్టి కర్మలు పర్వతం మీద ఉన్న ఏలీషా యొద్దకు వెళ్లి అతని కాళ్ళు పట్టుకొని అతని పరిస్థితిని తెలియ పరిచింది. అతడు తన పనివాడిని పంపిస్తాను అని చెప్పినప్పుడు వద్దు మీరే రావాలి అని కచ్చితంగా నిలబడింది. ఆమె విస్వసించిన ప్రకారం ఆమె తన కుమారుడ్ని తిరిగి పొందుకుంది. పరిశుద్ధ గ్రంధంలో పేరు చెప్పబడని స్త్రీ గాను ఎక్కువగా బోధింప బడని స్త్రీగా ఈమె కనబడింది. సంరక్షించుటలోను, దేవుని పిల్లలను ఘన పరుచుటలోను, కచ్చితంగా విశ్వసించుట లోను ఈమె మన అందరికి ఉదాహరణ అని చెప్పవచ్చు.
ప్రియమైన వారలారా! ఒక వేళ మనకు సేవ చేసే అవకాశం ఉండవచ్చు. కాని మనం షూనేమియురాలు వలె మన ఊరికి వస్తున్న దేవుని సేవకులను ప్రేమతో మన ఇంటిలో చేర్చుకొని వారిని సంరక్షిద్దాం. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును అని పరిశుద్ధ గ్రంధంలో చెప్పబడినది వచనంలో చూస్తున్నాం. అవును షూనేమియురాలు వలె ఎటువంటి ప్రతిఫలన్ని మనం ఎదురు చూడకుండా మేలు చేసినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తారు అనే దానిలో మనకు ఎటువంటి సందేహం లేదు.
- శ్రీమతి. అనిత అలగర్ సామి
ప్రార్థన అంశం.
7000 మంది మిషనరీలను ప్రతి నెల 5000 రూపాయలు ఇచ్చి సహాయపడే కుటుంబాలు అభివృద్ధి చెందుట కొరకు ప్రార్ధించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250