Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Friday, 16-Jul-2021

దిన ధ్యానము(Telugu) 16.07.2021 (Bible Characters Special)

 

ఓబద్యా

 

"ఈ ఓబద్యా యెహోవాయందు బహు భయ భక్తులుగలవాడై యుండెను" - 1రాజులు 18:3

 

ఓబద్యా అనే పేరుకు అర్ధం "దేవుని సేవకుడు". ఇశ్రాయేలు రాజు అయిన అహాబు గృహములో గృహ నిర్వహకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఊరిలో కలిసి జీవించుట అనే సామెత ఉంది కాని ఓబద్యా దీనికి విరుద్ధంగా ఉన్నాడు. యెహోవాకు మిక్కిలి బయపడి నడుచుకున్నాడు అని పరిశుద్ధ గ్రంధంలో కొంత మంది గురించి మాత్రమే వ్రాయబడిఉంది ఆ కొంత మందిలో ఓబద్యా ఒకరు. అతని గురించి ఈ రోజు ధ్యానిద్దాం.

 

ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారదనలో నడిపించుటలో చాలా భాగం ఆహాబు రాజుకు ఉంది. తన భార్య అయిన యెజెబెలు అతనిని రెచ్చగొట్టుట వలన అహాబు చెడ్డవాడిగా నడుచుకున్నాడు అని చదువుతున్నాం. ప్రజలను విగ్రహారదనలో నడిపించుట మాత్రమే కాదు యెహోవా ప్రవక్తలను వెతికి వెతికి చంపారు అని కూడా చదువుతున్నాం. ఇటువంటి ఒక క్లిష్టమైన కాలంలో కూడా ఓబద్యా యెహోవా ప్రవక్తలకు మిక్కిలి సహాయకునిగా ఉన్నాడు. యెహోవా దీర్గదర్శకులైన నూరు మందిని చేర్చుకొని వారికి అన్న పానములు ఇచ్చి పోషించారు. ఇలా యెహోవా ప్రవక్తలను కాపాడుతూ పోషించుట వలన తనకు రాబోయే కీడు గురించి కొంచం కూడా కలత చెందలేదు. యెజెబెలుకు తెలిస్తే తనను ప్రాణంతో వదిలి పెట్టదు అని ఎరిగి కూడా ముందుకు అడుగువేశాడు. అందరి వలె అతను ఆహాబుతో, యెజెబెలుతో కలిసి నటించి దుర్మార్గుడు వలె బ్రతక లేదు. బదులుగా దేవుని ప్రేమించుటలో దేవుని సేవకులను కాపాడి పోషించుటలో చాలా శ్రద్ధ కలిగిన వాడి వలె ఉన్నారు. ఓబద్యా యొద్ద కనిపించే ఇటువంటి లక్షణాలు ఏదో అకస్మాత్తుగా బహుమతిగా ఒక్క రోజులో దొరకలేదు. చిన్న వయస్సు మొదలుకొని ఓబద్యా యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడు అని 1రాజులు 18:12 లో చెబుతుంది. 

 

ఈ దినధ్యాన వార్తలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇది చదువుతున్న మీరు వయస్సులో చిన్నవారు లేక పెద్దవారు అయిన సరే మీ ముందు ఉంచిన ప్రశ్న ఇదే యెహోవాకు భయపడే భయం నాలో ఉందా? అని మిమ్మల్ని మీరే అడిగి చూడండి. దేవుని గూర్చిన జ్ఞానము, భయముతో ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనలను ఆయనకు ప్రియముగా జీవించాలి అని దేవుడు పిలుస్తున్నాడు. మనుష్యులలో కొంత మందిని సంతోష పరచుట కొరకు పరలోక దేవుని దుఃఖ పరచవద్దు. ఇదంతా తప్పా అనే చిన్న ఆలోచన మనలను దేవుని మార్గంలో నుండి ఆయన మనలను తొలగి పోయేవారిగా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉందాం. 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

సాతాను వలన, వ్యాధి వలన బందించబడే ప్రజల కొరకు హీలింగ్ సర్వీస్ జరిగించుట కొరకు, దాని ద్వారా అనేకులు విడుదల పొందుట కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet