Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Thursday, 15-Jul-2021

దిన ధ్యానము(Telugu) 15.07.2021 (Bible Characters Special)

 

"పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును" - 1యోహాను 4:18

 

ఇశ్రాయేలీయులలో ఉన్నత నీతిమంతుల ప్రధాన న్యాయస్థానం వంటిది శనగరీబ్ ఆలోచన సంఘం. దానిలో ఘనత పొందుకున్న ఆలోచనకారుడు వలె ఉన్నాడు అరిమత్తయి యోసేపు. ఆ సంఘం తీర్పును బట్టియే యేసుక్రీస్తుకు మరణ దండన విధించబడింది. ఆ సంఘంలో ఒకనిగా ఉండి యేసుని వెంబడించుట అనేది ప్రమాదకరమైనది. కాని తన పలుకుబడిని, జీవితంలో గల అన్నింటిని చిన్నగా అల్పమైనదిగా భావించి యేసుని వెంబడించారు ఈ యోసేపు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రేవేశించుట అరుదు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ధనవంతుడు అయిన ఈయన దేవుని రాజ్యం వచ్చే వరకు వేచియున్నాడు. ఆరంబంలో యూదునికి బయపడినను అంతరంగ శిష్యునిగా ఉండి యేసుయొక్క మరణం చూచి వెనుదిరిగి వెళ్లిపోలేదు. పాపుల కొరకు మరణించి తిరిగి లేస్తాను అని చెప్పిన యేసుక్రీస్తును కచ్చితంగా విశ్వసించాడు. అందువలన ఇప్పుడు దైర్యంగా ఫిలతు యొద్దకు వెళ్లి యేసుక్రీస్తు దేహాన్ని అడిగి తీసుకొని పన్ను శనగరీబ్ సంఘంలో ఒకరైన నీకోదేము అనే విశ్వాసితో కలిసి యేసుక్రీస్తును మిక్కిలి మర్యాదగా సమాధి చేశారు. యూదులకు భయపడిన అతను ఇవన్నీ ఎలా చేసాడు? ఎందుకు అంటే అతను యేసుక్రీస్తు పైన ఉంచిన పరిపూర్ణమైన ప్రేమ అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టింది. ప్రేమ ద్వారా ఆ పనిని చేసే విశ్వాసం అతని యొద్ద ఉంది. తన నిరీక్షణ చనిపోలేదు అది జీవం కలిగినది అని తన పని ద్వారా నిరూపించ గలిగారు. 

 

యేసుక్రీస్తు పునరుద్దణ దినమున జ్ఞాపకం చేసుకుంటున్న మనతో అరిమత్తయి యోసేపు మాట్లాడుతున్నారు. క్రైస్తవ పతిఘటన పెరుగుతూ వస్తున్న ఈ రోజుల్లో విశ్వాసముతో ఎదురునిలిచి దేవుని వార్తను ప్రకటించుటకు మనము సిద్ధంగా ఉన్నామా? సొంత బంధువులకు బయపడి యేసుక్రీస్తును బహిరంగంగా అంగీకరించుటకు వెనకాడు తున్నమా? క్రైస్తవులము అని చెప్ప కుండా పనులు, స్కాలర్ షిప్ దొరకదు అని మానసిక ఆలోచన ఉందా? సువార్త పనిలో పాల్గోకుండా పదవీ పైన ప్రభావితం చూపుతుంది అని భయపడుతున్నారా? కాని యోసేపు యూదులకు బయపడలేదు. తన పదవి పోతుందని కూడా బయపడలేదు. 

 

యోసేపు యేసుక్రీస్తు దేహమును తీసుకొని శుభ్రమైన నార బట్టలతో చుట్టి తనకోరకు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసుక్రీస్తును ఉంచాడు. యేసుక్రీస్తు కొరకు కొరకు తన ఆస్తిలో గొప్ప ధనమును ఖర్చు పెట్టుటకు ఆయన ముందుకు వచ్చారు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ధనవంతుని ఇంట ఉంచబడెను అని యెషయా 53:9 లో వ్రాయబడిన ప్రవచనం నెరవేర్చుటకు దేవునితో ఈ యోసేపు పాలు పంచుకున్నాడు. అతని యొక్క గుణ లక్షణాలు మన యొద్ద కనిపిస్తే దేవుడు నిశ్చయముగా తన యొక్క రక్షణ ప్రణాళికలో మనలను చేర్చుకుంటారు. ఆమెన్.

- శ్రీమతి. గీతా రిచార్డ్.

 

ప్రార్థన అంశం:-

ఒక గ్రామానికి 2000/- రూపాయలు ఇచ్చి దత్తతు తీసుకొనే కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet