Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Wednesday, 14-Jul-2021

దిన ధ్యానము(Telugu) 14.07.2021 (Bible Characters Special)

 

యెఫ్తా కుమార్తె.

 

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3: 16

 

యెఫ్తా అనగానే మన ఆలోచనలోనికి వచ్చేది మ్రోక్కుబడి. న్యాయదిపతులు 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు యెఫ్తా కుమార్తె గురించి తెలుసుకుంటాం. అతను ఒక పరాక్రమం గల బలాఢ్యుడు. కాని తన యొక్క సొంత జనులే నువ్వు వెళ్లిపో అని త్రోసివేశారు. త్రోసివేసిన మనుష్యులే తిరిగి యెఫ్తాను వెతుకుంటా వచ్చారు. అతనిని వారిమీద అధిపతిగా ఉండుటకు ఒప్పుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యెఫ్తా అమోనియులకు విరోధంగా యుద్ధానికి వెళ్లినప్పుడు యెహోవాకు ఒక మ్రొక్కుబడి చేసి బయలుదేరి వెళ్లాడు. నేను ఆమోనియుల యొద్దనుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారామునుండి వచ్చినది ఏదో దానిని యెహోవాకు ప్రతిష్ఠితం అగును మరియు దహన బలిగా దానిని అర్పించెదను అన్నదియే మ్రొక్కుబడి. 

 

యుద్ధంలో యెహోవా తనకు ఇచ్చిన విజయంతో ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తంబురతోను, నాట్యముతోను అతనిని ఎదుర్కొనేను. యెఫ్తా యొక్క కుమార్తె యవ్వనురాలు, తండ్రికి ఒక్కగాను ఒక్క కుమార్తె. తనను చూచిన యెఫ్తా తాను యెహోవా యొద్ద చేసిన మ్రొక్కుబడి గుర్తు చేసుకొని కృంగిపోయాడు. కాని తన కుమార్తె మాత్రం ఎటువంటి గందరగోళం చేయకుండా తన తండ్రి యెహోవా యొద్ద చేసిన మ్రొక్కుబడిగా తననే సర్వాంగా దహనబలిగా అర్పించుకొనుటకు ఆమె సిద్ధపడింది. తాను మిక్కిలి ప్రేమించిన తన తండ్రి సమాధానం కొరకు యెహోవాకు చేసిన మ్రొక్కుబడి నెరవేర్చుట కొరకు దైర్యంగా తనను తానే బలిగా అంగీకరించింది. 

 

ప్రియమైన వారలారా! ఈ లోకంలో ప్రేమించిన మనుష్యుల కొరకు ఏదైనా చెయ్యాలి అని ఆతృత గల వారిగా జీవిస్తున్నాము. ఇతరులు మన కొరకు ఏదైనా చెయ్యాలి అని ఎదురు చూస్తుంటాము. కాని ఏ ఒక్క ఎదురు చూపు లేకుండా మనుష్యులమైన మన రక్షణ కొరకు తననే సిలువలో బలిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఇప్పటికి మనకోరకే పుట్టిన క్రీస్తు యొక్క ప్రేమ ఎంతో లోతైనది. ఆయన మన మీద చూపిన ప్రేమను వివరించుటకు పదములు చాలవు. సిలువ యొక్క ఉన్నతమైనను ప్రేమను గ్రహించిన వారివలె అను దినము ఇతరులకు క్రీస్తు ప్రేమను తెలియజేసే వారివలె నాట్యమాడుచు దేవుని స్తుతించుచు నడుచుకున్న వారివలె ఈ లోకంలో జీవిస్తున్న మనలనే జీవన బలిగా ప్రభువు యొద్ద అర్పించుకుందాం. ఆమెన్.

- శ్రీమతి. జబఖని శేఖర్ 

 

ప్రార్థన అంశం:-

ప్రతి జిల్లాల్లో యవ్వనుల కొరకు ప్రత్యేకమైన సభలు నిర్వహించుటకు దేవుడు కృప చూపుటకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet