Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Tuesday, 13-Jul-2021

దిన ధ్యానము(Telugu) 13.07.2021 (Bible Characters Special)

 

అభిగయేలు

 

"మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును" - సామెతలు 15:1

 

తెల్లవారే లోగా నాబాలుని వాడికి గల సమస్తాన్ని సర్వ నాశనం చేసేస్తాను అని క్రోధముతో బయలుదేరిన దావీదును ఎవరు అపగలరు. దావీదును మాత్రమే కాదు దావీదుతో ఉన్న 400 మందిని శాంతింప చేయుట ఎలాగు? ఓకే వ్యక్తిగా నిలబడి అభిగయేలు అనే స్త్రీ వాళ్ళను శాంతింప చేసి సమాధాన పరిచింది అని చదువుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది కాదు. దేవుని ప్రణాళికలో గొప్ప కార్యములను చేయుటకు బలహీనమైన ఘటములను కూడా ఎలాగు వాడుకుంటున్నారు అనే దాన్ని ఈ దిన సందేశంలో ధ్యానిద్దాం.

 

అభిగయేలు అనే ఈ పేరుకు గల అర్థం సంతోషం గల వ్యక్తి కాని దుష్టుడైన భర్త నాబాలు నిమిత్తముగా ఆమె సంతోషం లేకుండా ఉండి ఉండవచ్చు. అయితే ఆమె చాలా తెలివిగల స్త్రీగా ఉండేది. తన భర్త అయిన నాబాలు దావీదుకు చేసిన అన్నింటిని ఎరిగిన అభిగయేలు తొందరపడి దావీదును సమాధాన పరచుటకు తొందరగా పనిచేస్తుంది. మొదట్లో ఉపచరణ అనే మార్గాన్ని ఎంచుకొని వాళ్లకు విందును ఇచ్చే విధముగా తనకు ముందుగా పని వాళ్ళను పంపి దావీదును కలుసుకుంటుంది. గాడిదపైన వస్తున్న వాళ్ళు ఎవరు? ఎందు కొరకు నాకు ఆహారమును ఇస్తున్నారు అని దావీదు ఆలోచిస్తున్నప్పుడే అభిగయేలు దావీదు పాదములపై సాష్టాంగ పడి నమస్కరించింది. తన ముందు సాష్టాంగ పడిన వ్యక్తి నాబాలు యొక్క భార్య అభిగయేలు అని తెలుసుకొని దావీదు నిమ్మలమాయెను. అభిగయేలు తన శాంతము గల మాటలు చేత దావీదు యొక్క కఠిన హృదయాన్ని కరిగించి వేసింది. అభిగయేలు యొక్క మాటలు ఒట్టి పదజలములు మాత్రమే కాదు దాంట్లో దేవుని సత్యము, కృప నిండి యుండేది. అభిగయేలు యొక్క నడవడిక దావీదును మాత్రమే కాదు దావీదును మాత్రమే కాదు దావీదుతో ఉన్న వారిని కూడా శాంతింప చేసింది అంటే ఎంత గొప్పదో చూడండి. ప్రేమతో కూడిన ఉపచరణ, తగ్గింపుతో కూడిన హృదయము, దీర్ఘశాంతము, నిమ్మలమైన మాటలు ఇవన్నీ దావీదులో ఉన్న పగతీర్చు కోవాలి అనే తలంపు, హత్య చేయుటకు సిద్ధపడిన కోపము అనే దృఢమైన గోడను కూల్చివేసింది. అవును అభిగయేలు తన గుణాతిశయాము చేత కఠినమైన పరిస్థితిని జయించింది. బుద్దిగల స్త్రీ తన ఇల్లు కట్టును (సామెతలు 14:1). హల్లెలుయా!

- బ్రదర్. పి.జాకబ్ శంకర్

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న కట్టడ పనులకు అవసరమైన ధన సహాయం దేవుడు దయ చేయులగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 9325



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet