Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Monday, 12-Jul-2021

దిన ధ్యానము(Telugu) 12.07.2021 (Bible Characters Special)

 

దావీదు.

 

"యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి" - 2సమూయేలు 16:11

 

దావీదును తన సొంత కుమారుడైన అబ్షాలోము చంపడానికి వెతికినప్పుడు దావీదు అతనికి భయపడి కాలి నడకన పతిగెత్తుతున్న సమయంలో సౌలు ఇంటి వంశస్తుడైన సెమి దావీదును దూషిస్తూ, రాళ్లు విసురుతూ, ధూళి ఎగరగొట్టుచు వచ్చెను. నరహంతకుడా, దుర్మార్గుడ చి పో అని అతనిని దూషిస్తున్న మాటలు పచ్చి పుండు మీద ఈటెతో గుచ్చినట్లు ఉన్నవి. దావీదుతో ఉన్నవారు మీ చిత్తమైతే మేము వెళ్లి వాడి తలను ఛేదించి వచ్చెదను అని చెప్పినప్పుడు దావీదు మాత్రం ఆ కార్యమును దేవుని యొద్ద అప్పగించి అతను అలా దూషించాలి అని యెహోవా సెలవిచ్చియున్నాడు అని అన్నాడు. నన్ను కారణం లేకుండా దూషిస్తున్న వారికి ప్రభువు తప్పక కీడును చేస్తారు అని చెప్పకుండా ఈ నిందకు బదులుగా ప్రభువు నాకు మేలును చేస్తారు అని మాత్రమే చెప్పారు. ఇక్కడ దావీదు యొక్క స్వచ్ఛమైన హృదయాన్ని చూడండి. 

 

కాని ఇప్పటికి ప్రసంగ వేదికలో చెబుతున్న కార్యం ఏమిటి మీ శత్రువును యెహోవా బలి తీసుకుంటారు బలి తీసుకొనుట అనేది అతనికి చెందినది అని చెప్పి శత్రువులను ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని మార్చి వారు ఎప్పటికైనా పడిపోవుదురు ప్రభువు వారిని బలి తీసుకొందురు అనే ఆలోచనతో చూస్తున్న మానసిక స్థితిని అభివృద్ధి చేసేసారు. కనుక అన్యజనులకు, క్రైస్తవులకు ఏమిటి వ్యత్యాసం ఉంది. మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు అతడే సాతాను. 

 

ప్రియమైన వారలారా! యేసుక్రీస్తు గురించి పరిశుద్ధ గ్రంధం చెబుతున్నది ఏమిటి? అతడు దూషింపబడినను అతను బదులు చెప్పలేదు, శ్రమలు అనుభవించినప్పుడు బయపడలేదు, న్యాయముగా తీర్పు తీర్చే వారికి తనను అప్పగించుకున్నారు. ఇదే ఆలోచన దావీదు యొద్ద కనిపించింది. మనము కూడా ఇటువంటి స్వభావాన్ని కలిగియుండాలి. ఎంత మంది సెమీలు లేచినను ప్రభువా ఈ కీడును మేలు వలె మార్చు అని ప్రార్థిద్దాం. తరువాత రోజుల్లో సెమిని శిక్షించే అవకాశం దావీదునకు వచ్చినప్పటి కూడా దావీదు క్షమించాడు (2సమూయేలు 19:23). ఎదురు చెప్పుటకు, కత్తిపోటు పోడువుట కోరుకోకుండా సాధారణముగా నడుచుకున్న దావీదు మనకు మంచి నమూనా కదా. అవును అన్యజనుల ముందు మనము దైవిక స్వభావమును చూపిద్దాం. ప్రభువు మనకు తోడైయుండును గాక!

- బ్రదర్. టి. సమూయేలు

 

ప్రార్థన అంశం:-

మన మోక్ష ప్రయాణం దిన ధ్యాన వార్తను 8 భాషల్లో తెలియ జేయుటకు సహాయం చేస్తున్న భాష అనువాదికులును దేవుడు ఆశీర్వదించులాగున ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet