By Village Missionary Movement
Sunday, 11-Jul-2021దిన ధ్యానము(Telugu) 11.07.2021 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
మూడు సిలువలు.
"మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును" - లూకా 15:7
చిన్న పిల్లలారా ఈ ఏరోజు మనము అందరం యెరూషలేము పట్టణమునకు బయటఉన్న గోల్గోత అనే కొండ దగ్గర ఏమి జరిగింది అని చూడటానికి 2000 సంవత్సరాల వెనుకకు వెళ్లబోతున్నాము. రెడీ ఆ....
కొండ మీద మూడు సిలువలు నిలవబెట్టబడి ఉన్నాయి. ఒక్కొక్క సిలువలో ఒక్కొక్కరు వేలాడ దీయబడి ఉన్నారు. మధ్యలో ఉన్న సిలువలో మిమ్మును నన్ను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వ్రేలాడదీయబడిన సిలువ. అతనికి రెండు ప్రక్కల ఇద్దరు దొంగలు సిలువ వేయబడివున్నారు. సిలువ వేయబడిన ఒక దొంగ ప్రభువైన యేసును చూచి అరుస్తూ నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించుము అని అన్నాడు. యేసుక్రీస్తు మాత్రము ఏమి మాట్లాడకుండా చేతుల్లో, కాళ్లల్లో ఉన్న మేకులు గాయాల వేదన అనుభవిస్తున్నారు. కాని ఇంకొక దొంగ దూషించుచున్న వానిని చూచి దేవునికి బయపడవ మనము అయితే తప్పు చేయడం వలన శిక్ష పొందుతున్నాము కాని ఆయన అయితే ఏ తప్పు చేయకుండానే శిక్ష పొందుతున్నారు కనుక అతనిని దూషించుట ఆపు అని కోపంతో గద్దించాడు. కొద్దీ సేపటి తరువాత అతను యేసుక్రీస్తు వైపు తిరిగి కన్నీటితో నిండిన కన్నులతో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞపకం చేసుకొనుము అని అన్నాడు. యేసయ్య ఇతనిని చాలా ఇష్టపడ్డారు. జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు అద్బుతములను చేసినప్పుడు అంటే వ్యాధిగ్రస్తులను బాగు చేసినప్పుడు, చనిపోయిన వారిని లేపినప్పుడు కూడా కొంత మంది ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. కాని ఇక్కడ చాలా మోసకరమైన నేరస్తుడైన ఈ దొంగ యేసుక్రీస్తు మనిషిలా బలహీనుడుగా వేలాడదియబడినప్పుడు యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాడు సూపర్ కదా!. యేసుక్రీస్తు అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో వుండేదవు అన్నారు. జీవిత చివరి నిమిషములో అతని పాపములు క్షమించబడిన వాని వలె మారుమనస్సు పొంది పరలోకం వెళ్లుటకు అర్హత పొందుకున్నాడు.
పిల్లలు ఈ లోకంలో చాలా మంది ఆశీర్వాదం కొరకు, అవసరల కొరకు, సమస్యలు మారడం కొరకు, వ్యాధులు తగ్గడం కొరకు కాని ఆ దొంగ వీటిలో దేనిని అడగడం లేదు అతను ఆడిగించి రక్షణ మాత్రమే. మీరు కూడా ఈ లోక ఆశీర్వాదం కొరకు యేసుక్రీస్తును వెతకకుండా మీ జీవితంలో యేసు నిండియుండుట కొరకు మీ పాపములు క్షమించుట కొరకు అతనిని అడిగినట్లు అయితే ఆమూల్యమైన పరలోక జీవితమునకు వారసుడవు అవుతావు. ఒకే నా!
శ్రీమతి. అనిత అలగర సామి
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250