By Village Missionary Movement
Saturday, 10-Jul-2021దిన ధ్యానము(Telugu) 10.07.2021 (Bible Characters Special)
హన్నా:- నా ఆత్మను యెహోవా సన్నిధిలో కృమ్మరించు కొనుచున్నాను.
"హన్నా-అది కాదు, నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యము నైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను." - 1సమూయేలు 1: 15
హన్నా పాతనిబంధనలో ఒక సాధారణ స్త్రీ ఆమె ప్రార్ధన ప్రత్యేకమైన, శక్తివంతమైనది. ఇశ్రాయేలీయులలో ఒక తల్లి వలె ఉన్న ఒక హన్నా జీవితంలో నుండి మనం అనుసరించవలసిన చాలా గుణములు ఉన్నాయ్. వాటిలో ముఖ్యంగా తనలో ఉన్న నిశ్శబ్దమైన ఆత్మ, శాశ్వతమైన అలంకరణ ఆమె హృదయంలో దాచబడి అలంకరణ ఆమె హృదయంలో దాచబడి కనిపించింది. అది దేవుని దృష్టిలో విలువైనది.
హన్నా జీవితంలో పిల్లలు లేని లోటు ఉండేది. అందువలన ఆమె వేదనకు గురైంది. హన్నా దేవుని మందిరమునకు పోవునప్పుడెల్లా పెనిన్నా ఆమెకు కోపం పుట్టించెను ఇందువలన ఆమె చాలా సంవత్సరాలుగా హన్నా ఏడ్చింది, నిందను అనుభవించింది. వేధించబడింది, నలుగగొట్టబడింది, కాని ఒక విషయాన్ని గమనించండి తాను ఏ పరిస్థితుల్లో కూడా పెనిన్నాకు బదులుకు బదులుగా మాట్లాడకుండా భర్తకు ప్రియమైన దానిని నేనే అని అనకుండా ఉంది. పెనిన్నా గురించి ఎవరిదగ్గర నోరు విప్పలేదు బదులుగా తన కంటినుండి వచ్చిన కన్నీరే ప్రతిస్పందన అయ్యింది. పెనిన్నా యొద్ద మాత్రమే కాదు ఏలి యొద్ద కూడా అలానే నడుచుకుంది. దేవుని సన్నిధిలో బహు మనోవేదనతో ప్రార్ధించి ముగించుకొని లేస్తూన్న హన్నా యొద్ద ఏలి ఎంతవరకు నీవు మత్తురాలై యుందువు అని అడిగారు. కాని ఆమె భావోద్వేగముతో కోపించి ఏ బదులు చెప్పకుండా అది కాదు నా ఏలిన వాడ అని పలికింది. జీవితంలో కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆమె తన మంచి స్వభావాన్ని కోల్పోలేదు. అవును కుటుంబంలో హన్నాను గొప్ప చేసింది ఈ స్వభామే. ఇందు నిమిత్తము భర్త యొక్క ప్రేమ, కరుణ, సంరక్షణ అధికముగా పొందుకుంది. శరీరనుసారంగా ఆమె భర్తకు ఎదురు సమాధానం చెప్పకపోవడం వలన ఆమె ఆత్మీయ స్త్రీ అయింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది కనుక పరలోకం ఆమె కొరకు మ్రోగింది. అవును సమూయేలు పుట్టడు. ఇప్పుడు నోరు తెరిచి దేవున్ని స్తుతించింది.
ప్రియమైన వారలారా! కుటుంబంలో, పని చేసే స్థలాల్లో , మీ యొక్క శరీర ఆలోచనలు బట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఆత్మీయులై నడుచుకొనుడి. మీరు నిశ్శబ్దంగా ఉంటే పరలోకమే మీ కొరకు మ్రోగుతుంది అనేది మరచిపోవద్దు. నిశ్శబ్దదానికి కారణం పిరికితనం అని తలంచవద్దు. దేవుని దృష్టిలో శాంతం, నిశ్శబ్దం విలువైన అలంకారాలు కావ. హన్నా కథను మనము పిల్లలకు నేర్పించాము ఇప్పుడు హన్నా యొద్దనుండి మనము నిశ్శబ్దం నేర్చుకుందాం.
- శ్రీమతి. ఏబెన్ సంతోష్
ప్రార్థన అంశం.
గెత్సేమనే క్యాంపస్ కు వచ్చి ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం తీసుకొని వెళ్తున్న వారు యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి అని ప్రార్ధించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250