Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Friday, 09-Jul-2021

దిన ధ్యానము(Telugu) 09.07.2021 (Bible Characters Special)

 

నయోమి.

 

"ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును" - యాకోబు 1: 14

 

న్యాయధిపతుల కాలంలో ప్రజలకు న్యాయం తీర్చుతున్న కాలంలో ఇశ్రాయేలు దేశంలో కరువు ఏర్పడింది. అప్పుడు రొట్టెలు గృహము అనిపిలవబడుతున్న బేత్లెహేము నుండి ఎలీమెలెకు అతని భార్య నయోమి మరియు వారి ఇద్దరి పిల్లలను తీసుకొని మోయాబు దేశంనకు వెళ్లి అక్కడ నివసించారు. కొన్ని దినముల తరువాత ఎలీమెలెకు మరణించాడు. తరవాత తన కుమారులకు ఆ దేశంలోనే పెళ్లి చేసింది నయోమి. వచ్చిన ఆ ఇద్దరు కోడళ్లు కూడా నయోమిని ఎక్కువుగా ప్రేమించారు. ఒకే సంవత్సరంలో ఆమె ఇద్దరు కుమారులు కూడా మరణించారు. ఇప్పుడు నయోమి ఒంటరిగా అయిపోయి ఆలోచించడం ప్రారంభించింది. మగ వారి సహాయం లేకుండా అన్యుల దేశంలో ఒంటరిగా జీవించడం కంటే మన దేశమునకు వెళ్లుటయే మంచిది అని ఎరిగి బయలుదేరింది. అలస్యమైన గాని మంచి నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కొడళ్లను దీవించి ముద్దాడి వాళ్ళను వారి తల్లి ఇంటికి వెళ్ళమని చెప్పింది. వారు మేము వెళ్ళాము అని ఏడ్వాడం మొదలుపెట్టారు. కోడళ్ల యొక్క హృదయంలో అత్త ఎంతగా చోటు సంపాదించుకొన్నదో చూసారా. మిక్కిలి బలవంతము చేత ఒక ఆమె వెళ్లి పోయినప్పటికీ రూతు నయోమిని విడవకుండా బేత్లెహేముకు ఆమెతో కూడా వెళ్లింది.

 

బేత్లెహేముకు వెళ్లిని నయోమి ( ఇంపైన కుమార్తె) అని పిలవకుండా మార (చేదు) అని పిలవమన్నది. సర్వశక్తి మంతుడు నాకు మిక్కిలి చేదు అనుభవాన్ని ప్రసాదించారు అని తన యొక్క పరిస్థితికి దేవుడే కారణం అని అన్నది. ప్రభువు మీద నాలుగు నెరరోపణలు చేసింది. ప్రభువు నాకు చేదును అనుగ్రహించారు, ఒంటరిగా తిరిగి వచ్చేటట్లు చేశారు, నన్ను దుఖః పరిచారు, అని చెబుతుంది. కాని వీటన్నింటికి గల కారణం నయోమియే ప్రభువు కాదు. కరువు వచ్చింది అని వేరే చోటుకు వెళ్లిన వారు మరల తిరిగి వచ్చియుంటే బాగున్ను భర్త చనిపోయిన గాని తిరిగి రాలేదు. ఆ దేశంలో గల ప్రభువుని ఎరుగని స్త్రీ లను తన బిడ్డలకు ఇచ్చి వివాహం చేసింది. తన ఇష్టానుసారంగా సమస్తాన్ని చేసినప్పటికీ ప్రభువు అయితే మీద కనికరము గల వారిగా ఉన్నారు. 

 

ఇలాగే ఈ దినము అనేకులు తన సొంత జీవితంలో తప్పుడు నిర్ణయములను తీసుకొన్నప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా వున్నప్పుడు ప్రభువు నాకు ఇలా చేశారు అని చెబుతున్నారు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును అని యాకోబు 1: 14 లో చదువుతున్నాం. అయి నప్పటికి మన దేవుడు దయ గలిగిన వాడిగా దిక్కులేని వారికిని, వెధవరాళ్లకు న్యాయం చేస్తున్నారు. రూతుకు తన బందువు అయిన బోయజును ఇచ్చి వివాహం చేయబడింది. వీళ్లకు జన్మించిన ఓబేదు యొక్క సంతతిలొనే జన్మించారు యేసుక్రీస్తు. ఆహా ఎంత అద్భుతం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశవళిలో మోవాబు స్త్రీ అయిన రూతు చోటు దక్కించుకుంది. నయోమి యొక్క చేదు అయిన జీవితం మార్చబడింది. అవును మన సొంత ఆలోచనలో మనం ఎక్కడ ఉన్నప్పటికి మరల తిరిగి దేవుని యొద్దకు వస్తే సంరక్ష సరిహద్దులలోనికి తీసుకురాబడి మదురముగా మారుతుంది. హల్లెలుయా! 

- శ్రీమతి. భువన ధన బాలన్

 

ప్రార్థన అంశం.

మన మిషనరీ ఆల్విన్ యొక్క భార్య నిరోష కి దేవుడు అనుగ్రహించిన కుమార్తె కొరకు దేవున్ని స్తుతించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet