Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Thursday, 08-Jul-2021

దిన ధ్యానము(Telugu) 08.07.2021 (Bible Characters Special)

 

దెబోరా

 

"నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా" - న్యాయాధిపతులు 4:7

 

ఈ రోజు ధ్యానములో దెబోరా అను నేను మీతో మాట్లాడుటకు వచ్చాను. నేను పరిశుద్ధ గ్రంధంలో ఒక స్త్రీని. దెబోరా అనే నా పేరుకు తేనెటీగ అని అర్థము. నేను తేనెటీగ వలె చురుకుగా నడుచుకున్నాను. నా భర్త పేరు లప్పీదోతు. మేము రామకు మరియు బేతేలుకు మధ్యనున్న ఎఫ్రాయిము మన్యమందలి ఒక సరళ వృక్షం క్రింద జీవించాము. 

 

కుటుంబ నాయకురాలిగా నా బాధ్యతను, విధులను త్వరగా ముగించుకొని ప్రతి రోజు సరల వృక్షం క్రిందికి వచ్చి కూర్చుంటాను. తరువాత ప్రజలు తీసుకువచ్చిన సమస్యలను ప్రభువు సహాయంతో న్యాయాన్ని వివరించి తీర్పును చెబుతాను. ఇశ్రాయేలీయులలో ఉన్న 16 మంది న్యాయాదిపతులలో స్త్రీని నేను ఒక్కదానినే. పరిశుద్ధ గ్రంధములో గల 7 గురు మహిళ దీర్గదర్శకులలో నేను ఒక దానిని. యాబిను అనే కానాను రాజు 20 సంవత్సరాలుగా దేవుని ప్రజలైన మమ్ములను కఠినముగా బాధపెట్టాడు. మేము యెహోవాకు మొఱ్ఱ పెట్టినప్పుడు యెహోవా బారకునకు రాజుగా నిలవబెట్టారు. కాని బారకు యుద్ధానికి భయపడి నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్లెదను అన్నాడు. కాబట్టి నేను కూడా వెళ్ళాను. మేము యుద్ధంలో జయించుట వలన యెహోవాకు కీర్తన పాడి స్తుతించాము. నాకు ఎప్పుడు యెహోవాకు స్తుతించడం, కీర్తనలు పాడటం అంటే ఇష్టం. 

 

నేను ఇశ్రాయేలీయులలో న్యాయధిపతిగా ఉండే సమయంలో 40సంవత్సరాలు దేశం నిమ్మలముగా ఉండేను. నేను ప్రజల సంక్షేమ సముదాయనికి మేలు చేయుటకు దేవుడు నన్ను బలపరిచాడు. యాబినుకు భయపడి ప్రజలు గ్రామాలను విడిచి పోయారు. వాళ్ళను మరల పిలుచుకొని వచ్చి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళను స్థిరపరిచాను. దేవుని బలముతో ఇటువంటి చాలా కార్యాలు చేయడం వలన ప్రజలు నన్ను తల్లి అయిన దెబోరా అని పిలిచేవారు.

 

సహోదరి సహోదరులారా! మీరు దేవుని కొరకు పని చేయుటకు లేవండి. పరిస్థితులు అనుకూలంగా లేవు అంటున్నారు నా జీవితంలో కూడా పరిస్థితులు అననుకూల పరిస్థితుల ఉన్నాయి కదా. కుటుంబ బాధ్యతలు, పనులు నాకు ఉన్నాయి వాటిని ప్రణాళికతో చేసి దేవుని కొరకు ఆ పనిని కూడా ఉత్సాహంగా చేసేదాన్ని. దేవుని కొరకు లేచిన ఎవరు కూడా సాదించకుండా ఉండలేదు. బలహీనమైన స్త్రీలను దేవుడు తన చిత్తనుసారంగా వాడుకుంటారు అనేది కచ్చితం. అవును దేవుడు మీ ద్వారా చుట్టు ప్రక్కల గ్రామాల్లో రక్షణ అనుగ్రహించడానికి మిమల్ని వాడుకుంటారు అయితే మేల్కొంటారా? ఇశ్రాయేలీయులకు తల్లిగా నేను భారతీయులకు తల్లిగా మీరు మారాలి అని అభినందిస్తూ వీడ్కోలు చెప్పుతున్నాను.

- శ్రీమతి . జబా డేవిడ్ గణేషన్ 

 

ప్రార్థన అంశం:-

లాక్ డౌన్ వలన పాఠశాలలకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్న పిల్లల రక్షణ మరియు భవిష్యత్ గురించి ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al