By Village Missionary Movement
Wednesday, 07-Jul-2021దిన ధ్యానము(Telugu) 07.07.2021 (Bible Characters Special)
కాలేబు.
"మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను" - సంఖ్యాకాండము 13:30
కానను దేశము ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడిన పాలు తేనెల ప్రవహించే మంచి దేశము. ఆ దేశమును వేగుచుచుటకు మోషే 12 గోత్రముల నుండి 12 మందిని పంపెను. వారిలో 10 మంది తిరిగి వచ్చి వాళ్ళు మిడతలు దండువలె వున్నారు అని చెడు వార్తను వ్యాప్తి చేశారు. ఈ 10 మంది వారితో తమను పొలుచుకున్నారు. యెహోషువ, కాలేబు మనతో యెహోవా తోడుగా ఉన్నాడు మనము బయపడవలసిన అవసరం లేదు. ఆ దేశాన్ని సులబంగా స్వాతంత్రించు కోవచ్చు అని చెప్పారు. విశ్వాస వీరులైన కాలేబు గురించి ఇంకా కొంచం తెలుసుకుందామా.
కాలేబు గురించి పరిశుద్ధ గ్రంధం మళ్ళీ మళ్ళీ చెప్తున్న అత్యుత్తమమైన సాక్ష్యం అతను ప్రభువును నమ్మకంగా వెంబడించారు. అతను దేవుని పైన కదిలించలేని నమ్మకమే దేవుడు అతని కోరుకు చెప్పిన మంచి సాక్షం. ఇశ్రాయేలు అందరూ యెహోవా పైన నమ్మకం కలిగిన వారే కాని అంత మందికి లేని విశ్వాసం ఇతనికి రావడానికి కారణం ఏమిటి? దేవునీతో అతనికి ఉన్న సంబందం. ఉన్నతమైన హృదయమే దేవుని మహిమను తెలుసుకొనే విలువను అతనికి ఇచ్చింది. దేవుడు కానాను దేశం మనకు ఇస్తాను అని చెప్పారు కాబట్టి ఇవ్వకుండా ఉంటారా? ఇశ్రాయేలీయులు దేవునికి కఠినత్వం ఉన్నదా? అని యెహోవా సెలవిచ్చినది నమ్మినంత చిన్నదే. కాని ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. 85 సంవత్సరాల వయస్సులో 45 సంవత్సరాల వయస్సులో గల బలాన్ని కలిగి ఉన్నాడు.
ప్రియమైన వారలారా! మన భారత దేశాన్ని నిశ్చయముగా సొంతం చేసుకోగలము అనే విశ్వాసం మనకు ఉందా? పరిపాలించే వారిని, చట్టాలను ఎదిరించే వారిని చూసి వీరు మనకంటే బలమైన వారు మనము బలహీనమైన మిడతలు వలె ఉన్నాము అని అనుకుంటున్నారా? మనము ప్రతి రోజు ఉన్నతమైన హృదయముతో యెహోవాను వెంబడించే వారివలె ఉంటే నిశ్చయముగా కాలేబులో ఉన్న కదిలించలేని ఉత్సాహం, విశ్వాసం ఉంటుంది. దేవుడు ఎవరు అని తాను చెయ్యలేని అతిశయమైన కార్యం ఏమి లేదు అని దాని గూర్చి స్పష్టమైన జ్ఞానం మనకు సులభంగా జయించవచ్చు అనే విశ్వాసం ఇస్తుంది. అవును పరిస్థితులు కాదు, చుట్టూ పక్కల ఉన్న ప్రజలు కాదు గాని మనలో ఉన్న సర్వ శక్తి మంతుడైన దేవుని వైపు చూద్దాం. చాలా సులభంగా మన దేశాన్ని క్రీస్తుకు సొంతం చేద్దాం. మన దేశాన్ని క్రీస్తుకు సొంతం చేస్తాం అనే దాంట్లో నిశ్చయాత కలిగి ఉందాం. ఆమెన్.
- బ్రదర్. డేవిడ్ నవమని
ప్రార్థన అంశం:-
మన గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న భనవన నిర్మాణ పనులలో దేవుని హస్తం తోడై ఉండి నడిపించులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250