Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.07.2021 (Bible Characters Special
Share:

By Village Missionary Movement

Tuesday, 06-Jul-2021

దిన ధ్యానము(Telugu) 06.07.2021 (Bible Characters Special)

 

యోకెబెదు:

 

"ఫరో కుమార్తె ఆమెతోఈ బిడ్డను తీసికొని పోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము" - నిర్గమకాండము 2:9

 

కానాను దేశంలో గోరమైన కరువు ఏర్పడినప్పుడు బ్రతకడం కొరకు యోసేపు వలన ఐగుప్తుకు తీసుకువెల్లబడిన యాకోబు కుటుంబంలో లేవి ఒకరు. లేవికి వృద్దాప్యంలో పుట్టిన కుమార్తె ఈ యోకెబెదు. యోకెబెదు అనగా "యెహోవా యొక్క మహిమ" అని అర్ధం. ఈమె యొక్క భర్త అమరాము. వీళ్లకు పుట్టిన పిల్లలు అహరోను, మిర్యాము, మోషే (నిర్గమకాండము 6:20). మూడవ శిశువుయోకెబెదు గర్భంలో వున్నప్పుడు ఐగుప్తు రాజు మగ బిడ్డలను పుట్టిన వెంటనే చంపేయాలి అని ఆజ్ఞపించారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఇంకొక శిశువా మనకు ఒక మగ పిల్లవాడు ఒక ఆడపిల్ల ఉన్నారు కదా పోతే పోనీ సులభంగా ఆలోచించలేదు. మోషేను 3నెలలు దాచిపెట్టి ఆ తరువాత దాచిపెట్ట లేని కారణంతో దేవుని పైన విశ్వాసముంచి మోసళ్ళతో నిండియున్న నైలు నదిలో ఆ ఆపిల్లవాడిని ఒక జమ్మూ పెట్టిలో పెట్టి వదిలి పెట్టింది. సమస్యలను ఎదుర్కొనే విశ్వాసం, భయాన్ని నెట్టివేసే విశ్వాసం, లోబడే విశ్వాసం యోకెబెదులో కనిపించింది. 

 

ఫరో కుమార్తె ద్వారా జీతమునకు మళ్ళీ మోషేను పెంచే అవకాశం వచ్చింది. విశ్వసించే వారిని దేవుడు విడిచిపెడతాడా? పిల్లలు మనకు దేవుడు ఇచ్చిన బహుమానం వాళ్లకు డబ్బులు ఇచ్చే దానికంటే సమయం ఇవ్వడం ముఖ్యం. ఆమె తన కుమారుడికి పాలు ఇచ్చి పెంచే దాని కంటే జీవము గల దేవుని జ్ఞానంతో పెంచారు. అందువలన మోషే రాజ భవనములో గల ఆడంబరం కంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటయు, పాపములో కలుగు సంతోషాన్ని అనుభవించుట కంటే నిందను అనుభవించుట మేలు అని తెలుసుకున్నారు. పరిశుద్ధ గ్రంధంలో. మొదట 5 పుస్తకములను రాసిన మోషేకు ఎక్కనుండి దేవుని జ్ఞానం వచ్చి ఉంటుంది. 

 

ప్రతి తల్లి తన బిడ్డలను అభివృద్ధి పరిచే కవిత. తల్లి ఒడి బిడ్డకు శ్రేష్ఠమైన బడి. ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లలను ఎలా పెంచుతున్నరూ? యోకెబెదు వలె మన పిల్లలకు దేవుని జ్ఞానం నేర్పిస్తున్నమా? యోకెబెదు తన పిల్లలను పెంచే విధానము చూడండి. మీరియము ఒక అత్యుతమమైన గాయకురాలు, దీర్ఘ దర్శకురాలు, ఆరాధన నడిపించే వ్యక్తి. అహరోను ఇశ్రాయేలు యొక్క మొదటి ప్రధానమంత్రి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులోనుండి కానానుకు నడిపించే శాంతము గల నాయకుడు. శత్రువైన ఫరో చేతులో బానిసలుగా ఉన్న దేవుని ప్రజలను విడిపించుటకు దేవునికి మోషే ఉపయోగపడ్డాడు. నిత్యా నరకానికి వెళ్లిపోతున్నా ఆత్మలను తప్పించుటకు దేవుడు ఉపయోగించే పిల్లలుగా మీ పిల్లలు ఉండవచ్చేమో ఎవరికి తెలుసు. విశ్వాసురాలైన ఒక తల్లి వలె తన చేతికి అప్పగించిన పిల్లలను పెంచడానికి ప్రభువు మనకు కృప చూపును గాక! ఆమెన్.

- శ్రీమతి జబా డేవిడ్ గణేషన్

 

ప్రార్థన అంశం:-

త్రాగుడుకు బానిసలుగా ఉన్న ప్రజల యొక్క విడుదల కొరకు ప్రారంభించబడిన పీస్ సెంటర్ కొరకు ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al