Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Monday, 05-Jul-2021

దిన ధ్యానము(Telugu) 05.07.2021 (Bible Characters Special)

 

ఇస్సాకు:

 

"ఇస్సాకు ఆమెను ప్రేమించెను" - ఆదికాండము 24:67

 

మన పితురులైన అబ్రాహాము మరియు శార దంపతులకు వృద్దాప్యంలో జన్మించిన కుమారుడే ఇస్సాకు. ఈయనకు వివాహం జరగకమునుపే మరణించింది. 40వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాను ఎక్కువుగా ప్రేమించాడు. వీళ్ళ కుటుంబ నుండి నేర్చుకోవసిన కార్యములను, విడిచి పెట్టవలసిన కార్యములను ఈ దినము ద్యానిద్దామా!

 

నెర్చుకోవలసినవి:

ఇస్సాకు ఒక ప్రార్ధించే వ్యక్తిగా ఉన్నారు. వివాహము జరగకముందే సాయంకాలము వేళలో ధ్యానము కొరకు బయటకు వెళ్ళెను (అది 23:64). అనుదినం ఆయన ప్రార్థన జీవితం ఎదుగుతూ ఉండేది. వీళ్లకు 20 సంవత్సరాలుగా పిల్లలు లేరు అయినప్పటికీ తన భార్యను చిన్న చూపు చూడకుండా ఇతరుల యొద్ద తన కుటుంబ లోపములను మాట్లాడులేదు. కాని తన భార్య కొరకు దేవుని చూచి ప్రార్థన చేస్తున్నాడు (అది 25:21). దేవుడు ఆయన ప్రార్థన అలకించాడు. అవును మన కుటుంబ జీవితంలో కూడా భార్య భర్తల మధ్యలో స్నేహితులు గాని బంధువులు గాని ఎందుకు మీ తల్లిదండ్రులు కూడా దూరిపోకూడదు. దేవుని యొద్ద మాత్రమే కార్యములు అన్నీ కూడా చెప్పాలి. మనలో ఎంత మంది తన భార్యను, భర్తను వివాహం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రేమిస్తుఉన్నాము. భార్యకు పిల్లలు లేకుండా ఉండావచ్చు, లేదా బలహీనురాలై ఉండవచ్చు లేదా భర్తకు పని లేకుండా ఉండవచ్చు. దేవుడు ఇచ్చిన భాగస్వామిని సంపూర్ణ ప్రేమతో ప్రేమిస్తున్నమా? అని అలోచిద్దాం. మరియు ఇస్సాకు భార్యతో సమయాన్ని గడిపేవాడు. ఈ దినాల్లో మన సమయాన్ని దొంగిలించడానికి అనేక కార్యములు ఉన్నాయి అందులో టీ.వీ, సెల్ ఫోన్, న్యూస్ పేపర్ అనే వాటిలో మునిగిన భర్తలు అనేక మంది కనబడుతున్నారు. మీ యొక్క శరీర సగబాగమైన జీవిత భాగస్వామితో సమయం గడపండి. అదే కుటుంబ యొక్క కట్టడను మోస్తువున్న స్తంబం వంటివి. 

 

విడిచి పెట్టవలసిన కార్యములు:-

ఈ దంపతులకు పిల్లలు పెంపకంలో పక్షపాతం కలిగి ఉన్నారు. ఏశావు తండ్రి ప్రేమించే బిడ్డ అయితే యాకోబు తల్లి ప్రేమించే బిడ్డ అని వాళ్ళ ద్వారానే మనకు కనబడుతుంది. దీని ద్వారా వాళ్ళ కుటుంబ జీవితంలో ఒక పెద్ద విభేదము ఏర్పడింది. మనము మన పిల్లలు అందరిని ఒకే లాగా ప్రేమిద్దాం. చేతికి ఉన్న 5 వేళ్ళు ఒకే లాగా లేనట్లు మన పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉండుట సహజమే. అయినప్పటికీ వారందరినీ ఒకే లాగా ప్రేమించి దీవెనలు సరిసమానంగా పంచి ఇచ్చుటయే మన కుటుంబానికి ఇస్తున్న దీవెన. మన కుటుంబం దీవించబడుటకు ప్రేమతో పొంగిపొర్లుటకు దేవుడు దయ చేయును గాక! 

- శ్రీమతి. ఆగత సమూయేలు.

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యను ప్రార్థనతోను ధన సహయంతోను సపోర్ట్ చేస్తున్న సపోర్టర్స్ కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet