By Village Missionary Movement
Saturday, 03-Jul-2021దిన ధ్యానము(Telugu) 03.07.2021 (Bible Characters Special)
నోవాహు:
"నోవాహు విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను" - హెబ్రీ 11:7
సృష్టికి ముందు రోజుల్లో దేవుడు అన్నింటిని సృజించి మంచిది మంచిది అనే చెప్పెను. కాని భూమిలో మనుష్యులు పెరిగి అక్రమాలు చేసి నందుకు యెహోవా మనస్తాపం చెందారు. కాబట్టి సమస్తాన్ని నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. కాని ఆ తరము వారిలో నీతిమంతుడు, ఉత్తముడు అయిన నోవహును యెహోవా కన్నులు చూచెను. లోకానికి 'నో' అని దేవునికి 'ఓకే' అని నోవాహు జీవించాడు కదా!. లోకంలో విప్లవం తీసుకురావడానికి సమూహపు గుంపును నమ్మాలి కాని దేవుడు ఒక మనుష్యుడు కొరకు ఎదురు చూశారు. దేవుడు వెతుకుతున్న మనుష్యుడుగా జీవించాడు నోవాహు. ఈరోజు నోవాహు గురించి కొన్ని కార్యములను ధ్యానిద్దాం.
1. కృపను పొందుకున్న నోవాహు:
పెద్ద జన సమూహాన్ని నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు నోవాహుకు కృప కలిగెను. అర్హత లేని ఒకరికి దేవుడు చూపించే దయనే కృప. దేవుడు చూపించే దయ మీరు లెక్కించారా? తిన్న ఆహారం, ధరించే వస్త్రాలు, నివసించే ప్రదేశం మీకు ఉంటే లోకంలో ఉండే 75% ప్రజల కంటే అధిక వసతులను మీరు పొందుకున్నట్లు . అనుకున్న సమయంలో అనుకున్న వ్యక్తితో మనం మాట్లాడగలుగుతున్నాం అలాంటి అవకాశం లేకుండా ఈ లోకంలో 175 కోట్ల ప్రజల కంటే మీరు ఉన్నతమైనవారు. వ్యాధి లేకుండా ఉదయమున ప్రశాంతంగా లేచి రాత్రి పడక మీద ప్రాణాన్ని విడిచిపెట్టె వారికన్నా మీరు ధన్యులు. దాహం ఉంటే త్రాగడానికి నీరు ఉన్నదా అయితే మీరు 10 కోట్ల ప్రజల కంటే మీరు ఉన్నతమైన వారు. ఇంకా ఇలాంటి చాలా కృపలను దేవుడు మనకు ఇస్తువున్నారు. ఇన్ని కృపలను పొందుకున్న మనము ఆ కృపను వ్యర్థం చేసే వారిగా జీవిస్తువున్నమా? అలోచిద్దాం. నోవాహు కృపను పొందుకొనుటకు అర్హుడై నడుచుకున్నాడు
2.లోబడే నోవాహు:
కృపను పొందుకోవడం మాత్రమే కాదు దేవుని ఆజ్ఞలు అన్నింటిని లోబడేవాడిగా నోవాహు జీవించాడు. హెబ్రీ 11:7 లో తన కుటుంబాన్ని రక్షించుటకు ఓడను తయారు చేసాడు అని చదువుతున్నాం. పర్వతాన్ని కూడా చూడని కాలంలో జీవించిన నోవాహు దేవుని మాటకు లోబడి మొత్తం కార్యాలను నెరవేర్చాడు. మరి మన జీవితంలో దేవుని మాటకు 99% లోబడి 1% లోబడకపోయిన అది దేవుని మాటకు మనం లోబడనట్లే సమానం. 100% లోబడితేనే విధేయత. వ్యక్తులు, బంధువుల మాటలకు ఎగతాలిగా మాట్లాడకుండా దేవుని మాటకు లోబడ్డాడు నోవాహు. నోవాహు జీవితంలో ఉండే లోబడే గుణం మనకు అవసరం కదా! దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని భూమిపైన నెరవేర్చుదాం. ఆమెన్!
- జబా డేవిడ్ గణేషన్
ప్రార్థన అంశం:-
మన మిషనరీ పిల్లల యొక్క చదువుల కొరకు అవరమైన ధన సహాయం దేవుడు దయ చేయులాగున ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250