Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Friday, 02-Jul-2021

దిన ధ్యానము(Telugu) 02.07.2021 (Bible Characters Special)

 

అబ్రాహాము

 

"కాబట్టి అబ్రాముమనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహ ముండకూడదు" - ఆదికాండము 13:8

 

బందుత్వమా, ఆస్తియా అని నిర్ణయించు కోవాల్సి వచ్చి వేదికలో అబ్రాహాము సమీపంలో లోతు నిలబడియున్నాడు. ఐగుప్తు విడిచి వచ్చిన సమయంలో అబ్రాహాముతో అతని అన్న కుమారుడైన లోతు కూడా వచ్చాడు. అబ్రాహాము బంగారం, వెండి, పశువులు, బహు మంది పనివారు కలిగి గొప్ప ధనవంతుడుగా ఉండెను. అతనితో కూడా లోతు యొక్క పశువులను, పనివారును ఉన్నారు. ఇద్దరి గుడారాలు ప్రక్క ప్రక్కనే ఉంటూ నివాసం చేస్తున్నారు. ఒక రోజు వారి ఇద్దరి పశువుల కాపరులకు కలహము వచ్చింది. ఇన్ని రోజులు ఒకటిగా జీవిస్తున్న వీరిలో సమస్యలు అనే వేదికను చూడగలిగారు. తోటి నివాసులుగా ఉన్న కానానీయులు, పేరుజ్జీయులు పెద్ద భూకంపం కలుగబోతుంది అని చూస్తే ఇక్కడ చిన్న టపాసు కూడా పేలలేదు. 

 

అబ్రాహాము మిక్కిలి నెమ్మదిగా, సహణముగా లోతుతో మాట్లాడారు. మనం బందువులము మన మధ్య కలహము ఉండకూడదు. మన ముందు ఇంత పెద్ద దేశము ఉన్నది కాబట్టి నీవు ఎడమ తట్టునకు వెళ్లిన యెడల నేను కుడి తట్టునకును నీవు కుడి తట్టునకు వెళ్లిన యెడల నేను ఎడమ తట్టునకును వెళ్లెదను అని చెప్పి తనతో కలిసి వచ్చిన లోతుకు చెప్పగా లోతు తన కొరకు ఎంచుకున్న స్థలమును లోతు కొరకు వదిలి పెట్టారు అబ్రాహాము . లోతు కంటే అబ్రాహాము వయస్సులో, జీవిత అనుభవంలో పెద్దవాడై ఉన్నప్పటికీ తన యొక్క గొప్పతనాన్ని వెనక్కి నెట్టివేసి బంధం తెగిపోకుండా చూసుకున్నారు. 

 

ప్రియమైన వారలారా! మన గురించి ఏమిటి? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? బంధానికా లేక ఆస్తికా? బంధాలను అభిమానిస్తూ బంధుత్వాలను పగలగొట్టే వారిగా ఉన్నామా అలోచిద్దాం. బంధం కోసం తనను తాను తగ్గించు కున్న పాతనిబంధనలో అబ్రాహాము గురించి కొత్తనిబంధనలో మరువక అతని కొరకు చాలా చోట్ల వ్రాయబడి ఉన్నది. ఇప్పటికి మనం అతని గురించి మాట్లాడుతునే ఉన్నాం. అవును ఈ లోకం శాశ్వతం కాదు. మన ప్రాణానికి ఏ గ్యారంటీ లేదు అలాగే రేపటి దినం మనది కాదు. అయితే ఎందుకు కుటుంబాలతో యుద్ధం చేస్తున్నాం? ఒక తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు ఒకే ఊరిలో శత్రువులుగా ఉండవచ్చా? అబ్రాహామును గుర్తు చేసుకుందాం. విడిచిపెడితే దేవుడు మిమల్ని ఆశీర్వదించి జీవింప చేస్తారు. ఆమెన్!

- సెలెక్టెడ్

 

ప్రార్థన అంశం:-

ఫేస్ బుక్, యూట్యూబ్ లో రోజు వస్తున్నా బైబిల్ స్టడీని చూచి అనేకులు ఆత్మీయ మేలులు పొందేటట్లు ప్రార్థిద్దం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet