Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.07.2021 (Bible Characters Special)
Share:

By Village Missionary Movement

Thursday, 01-Jul-2021

దిన ధ్యానము(Telugu) 01.07.2021 (Bible Characters Special)

 

హేబెలు

 

"... అతడు మృతినొందియు ఆ విశ్వాసముద్వారా మాటలాడుచున్నాడు" - హెబ్రీయులకు 11:4

 

ఒకే ఇంట్లో ఒకే పరిస్థితుల్లో దేవున్ని గూర్చిన ఒకే బోధలో ఎదిగి వచ్చిన ఇద్దరు పిల్లలు. ఆలాగు ఉండినప్పటికి ఇద్దరి యొక్క గుణాతిశయాలు భిన్నంగా ఉన్నాయి. ఆ ఇద్దరు సహోదరులే కయీను, హేబెలు. భూమి పైన జన్మించిన మొట్టమొదటి పిల్లలు వీరే. వీరు యవ్వనస్తులుగా ఎదిగిన తరువాత కయీను పొలము పండించే వాడిగాను, హేబెలు గొర్రెల కాపరిగా అయ్యాడు. 

 

కొన్ని దినములు తరువాత ఇద్దరు కూడా దేవునికి ఆర్పణలు అర్పించడానికి వచ్చారు. అప్పుడు దేవుడి హేబెలు యొక్క అర్పణను అంగీకరించారు. కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించక పోవడం చేత కయీను హేబెలు మీద అసూయ, కోపము తెచ్చుకున్నాడు. హత్య చేసే ఆత్మ కయీనును ప్రేరేపించి తన తమ్మున్ని వంచన చేత తనతో పొలమునకు రమ్మని హేబెలును పిలుస్తున్నాడు. కాని హేబెలు అయితే తన మనస్సులో తాను తన అన్న కంటే శ్రేష్ఠమైన వాడినని అనే గర్వం గాని తన అన్న తనకు కీడు చేస్తాడు అని గాని లేక అమాయకపు హృదయముతో తన సహోదరునితో నడిచి వెళ్తున్నాడు. కయీను అయితే అసూయతో నిండిపోయి హేబెలును కొట్టి చంపివేశాడు. ఇక నాతో పోటీకి ఎవ్వరూ లేరు అని సంతోషించాడు. కాని నిజానికి నశించినది హేబెలు కాదు కయీనే . ఎందుకు అంటే హేబెలు దేవుని సన్నిధికి చేరుకొనబడ్డాడు కయీను అయితే దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు.

 

ప్రియమైన వారలారా! దేవుని దగ్గర మంచి అర్పణను అర్పించిన హేబెలు యొక్క మంచి హృదయాన్ని చూడండి ఈ హృదయమే కదా మనకు అవసరం. తన అర్పణను దేవుడు అంగీకరించినను హేబెలు యొక్క హృదయం కయీనును చూచి ఎంత మాత్రం గర్వించలేదు. తన సహోదరుని చిన్న చూపు చూడటం గాని తన అన్న యొక్క తప్పును ఎత్తి చూపించడం గాని చెయ్యలేదు హేబెలు. సహోదరుల మధ్యన ఉండ వలసిన ప్రేమ బంధము ఇదే. హేబెలుకు ఈ గుణమును నేర్పించుటకు తనకు ఎవ్వరు లేరు అలాగే తన ముందు తనకు మాదిరి ఎవ్వరు లేరు గాని ఆయన దేవుని వైపు చూచి నీతిమంతునిగా జీవించి ఇతరులకు మాదిరిగా నడవడం ప్రారంభించాడు. వారు నా మీద అసూయ పడతారా ఏమో, నా కుటుంబానికి కీడు చేస్తారేమో అని ఎప్పుడు సందేహాలతో జీవించ వద్దు. వంచన లేని నిష్కపటమైన హృదయంతో జీవిద్దాం. దేవున్ని నమ్మకంతో వెంబడిద్దాం. తనను అప్పగించబోతున్న వాడిని పక్కన పెట్టుకొని పాదములు కడిగి స్నేహితుడా అని పిలిచిన యేసుక్రీస్తు యొక్క హృదయం మనలో కూడా ఉండనివ్వండి.

- బ్రదర్. జకర్య

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడుగా ఉండేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet