Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.06.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 30-Jun-2021

దిన ధ్యానము(Telugu) 30.06.2021

 

వినయము అనే సద్గుణము.

 

"ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను" - యోహాను 2: 5

 

రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన వాళ్ళ యొద్ద ఒక ఇంటర్వ్యూ చేయబడింది. దాంట్లో యుద్ధ సైనికులు ఎలాగు ఒక దినము గడిపారు అనే దాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకరు దాక్కున్న గొయ్యిలో రోజంతా దాక్కునియున్నారు. అటువైపు వస్తున్నా జర్మనీ ప్రజల ట్యాంకులను తమ తుపాకులతో కాల్చారు. మరికొంత మంది సైనికులైతే విశ్రాంతి సమయమున షెటిల్ ఆడుతూ వున్నారు. ఇంకా కొంత మంది సైనికులు తమ శత్రువుతో కఠినముగా పోరాడుతున్నారు. వారి కమండర్స్ చెప్పిన ఆజ్ఞలు అందరూ లోబడ్డారు. ఆ దినము సాదారణ యుద్ధ దినము వలె వెళ్ళింది. తరువాత వాళ్లకు ప్రపంచ యుద్ధము రూపు మార్చిన బల్చ్ యుద్ధములో ఉన్నాము అని యుద్ధం చేస్తున్న వాళ్లకు తెలియదు. ఆదినములో వాళ్ళు చేసినది వాళ్లకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న వాటి అన్నింటి కొరకు వాళ్లకు తెలియదు. తమను నడిపించిన నాయకుని ఆజ్ఞకు మాత్రం లోబడి కార్యములు చేసి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీని ద్వారా మనము మన బాధ్యతను నెరవేర్చుతున్నప్పుడు పెద్ద విజయాన్ని పొందుకోగలరు అని గ్రహిస్తున్నాము.

 

ఈ దిన లేఖన భాగములో మోవాబు స్త్రీ అయిన రూతు గురించి చదువుతున్నాము. భర్తను కోల్పోయి వెదవరాలుగా ఉంటున్న రూతు తన అత్త అయిన నయోమి చెబుతున్న సలహా వినకుండా మీతో పాటు మిమ్మల్ని వెంబడించి వస్తాను అని లోబడి వెళ్లింది. మీరు నాకు చెవుతున్న వన్నీ చేస్తాను అన్నది. (రూతు 3:5) రూతు యొక్క విధేయతకు దొరికిన ఫలితం ఆమె సంతతి లోనుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు. 

 

విధేయతకు విలువ కలిగిన అలంకారం వంటిది పేతురు పత్రిక. దాంట్లో విధేయతను దరించుకొనుడి అని పేతురు వ్రాస్తున్నారు (1పేతురు 3:1-5). కానీ ఒకరికి ఒకరు విధేయత కలిగి ఉండుట అనేకులకు చేదుగానే ఉంటుంది. యుద్ధభూమిలో ఉన్న సైనికుడు తన పైన ఉన్న కమాండర్ కు లోబడి ఉండుట ఎంత ప్రముఖ్యమో అలాగే క్రైస్తవ ఆత్మీయ యుద్ధములో ఉన్న మనము ఒకరికి ఒకరు విధేయత కలిగి ఉండుట చాలా అవసరమైనది. ఇక్కడ విధేయత అనే సద్గుణము వచ్చినప్పుడు కొన్ని సార్లు కష్టముగా అనిపించవచ్చు లేదా మనము నిరుత్సాహ పడవచ్చు. కాని విధేయతను నెమ్మదిగా పాటించినప్పుడు నెమ్మదిగా ఫలితం దీవెన కరముగా ఉంటుంది.

- బ్రదర్. పి జాకబ్ సంగర్

 

ప్రార్థన అంశం:

మన పరిచర్యలో వాడబడుతున్న నాలుగు చక్రముల వాహనములను రిపేర్ లేకుండా ఉండేటట్లు, వాటిని నడిపేటప్పుడు దేవుని హస్తం సంరక్షించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet