Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.06.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 29-Jun-2021

దిన ధ్యానము(Telugu) 29.06.2021

 

న్యామూర్తి సింహాసనం.

 

"అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహోదరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము" - రోమీయులకు 14:10

 

లక్షలకొలది ప్రజలను చంపివేసిన హిట్లర్ గురించి ఒక ఆయన చెప్పినప్పుడు హిట్లర్ ని నరకంలో వేయకముందు ఇంక నరకాన్ని చాలా రేట్లు వేడిచేయాలి అన్నారంట. అనగా ఆయనకు ఇవ్వవలసిన శిక్ష నరకము కంటే ఇంకా కఠినమైనదిగా ఉండ వలసినది అన్నదే ఆయన యొక్క మాట. కాని బైబిల్ చెబుతున్నది ఏమిటి? నీవు ఎవరిని కూడా తీర్పు తీర్చవద్దు ఎందుకంటే అందరూ క్రీస్తు కృపాసనం ముందు నిలబడవలసి ఉంది. కాబట్టి నీవు పాపిగా తలంచుతున్న వాడు మాత్రమే కాక నీవు కూడా లెక్క అప్పజెప్ప వలసిన వాడిగా నిలబడవలసి ఉంది. కాబట్టి ఎవ్వర్నీ కూడా నేరస్తులుగా తీర్పు తీర్చుటకు ముందు ఉండకండి. ఇది మన పని కూడా కాదు.

 

యేసుక్రీస్తు ఒక దినము యెరూషలేములో ఉండేటప్పుడు పరిసయ్యులు వ్యభిచారము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని తీసుకువచ్చి ఆయన ముందు నిలబడబెట్టారు. వాళ్ళందరూ ఆమెపై రాళ్లు రువ్వి చంపాలి అని సిద్ధముగా నిలబడి ఉండేటప్పుడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఈ మాట వినిన వెంటనే ఒక్కరు కూడా అక్కడ నిలబడలేదు. అవును బహిరంగంగా పాపము చేసిన ఆమెను ప్రజలు చూసారు కాని అందరి యొక్క అంతరంగం గ్రహించిన ప్రభువు అయితే ఆమెను నేరస్తురాలిగా తీర్పు తీర్చకుండ ఇతరులను చూచి మీరు కూడా పాపులే కదా అని ఎంత చక్కగా నేర్పించారో చూడండి. 

 

దీనిని చదువుతున్న స్నేహితులరా! మనకు ఎప్పుడు ఇతరుల యొక్క నేరాలే మన ముందు నిలబడుతుంటాయి. వాళ్ళు శిక్షించబడాలి అనే ఉద్వేగం మనలో ఉంటుంది. కాని ఈ దినధ్యానము చెబుతున్న సందేశం ఏమిటి అంటే మన ప్రతి ఒక్కరము మన గురించి దేవుని యొద్ద లెక్క చెప్పవలసిన వారమై యున్నాము. కార్యము ఇలా ఉండుట వలన మనము ఎవ్వరిని కూడా తీర్పు తీర్చవద్దు. మనలను మనమే నిదానించి చూసుకుదాం, నీతి గల న్యాయాదిపతి యేసుక్రీస్తు మాత్రమే. మనము ఎన్నడూ ఆయన సింహాసనంలో కూర్చుండుటకు ప్రయత్నం చేయవద్దు. పౌలు రోమా సంఘమునకు ఈ సలహా చెబుతున్నారు. దానిని మన జీవితంలో కూడా అన్వయించుకొని లోబడదాం. దేవుని సముఖములో దయను పొందుకుందాం. 

- శ్రీమతి. యబన్ సంతోష్

 

ప్రార్థన అంశం:

గ్రామాల్లో మనం దర్శించే చిన్నారులు చివరి కాలపు ఆయుధాలుగా మారేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet