By Village Missionary Movement
Sunday, 27-Jun-2021దిన ధ్యానము(Telugu) 27.06.2021 (Kids Special)
"ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి" - 1థెస్సలొనికయులకు 5:18
హలో పిల్లలు! ఎలా ఉన్నారు? మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్ లేవు ఎంతసేపయినా పడుకోవచ్చు, జాలిగా ఆడుకోవచ్చు , పరీక్షలు లేవు. ఇలా ఉంటే మీకు సంతోషమే కదా? స్కూల్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. పడుకోవడం, లేవడం, ఆడుకోవడం ఇలా మీకు దొరికే అవకాశం ఎవరికీ దొరకలేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి సుమా! అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదు, చేతులు, కాళ్ళు, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఏది పడితే అది కొనుక్కుని తినకూడదు. ఓకేనా! టీవీ, సెల్ ఫోన్ చూస్తూ మీ కళ్ళను పాడుచేసుకోకూడదు. యేసయ్యకు ప్రియమైన పనులు చేయాలి సరే! కథ విందమా?
ఒక దట్టమైన అడవిలో చిన్న గ్రామం ఒకటి ఉండేది. ఆ గ్రామంలో కర్రలు నరికి అమ్మే ఒక వ్యక్తి జీవించేవాడు. ఆయనకు భార్య, ఒక కొడుకు ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి అడవికి వెళ్ళి కట్టెలు నరికి వారి జీవితాన్ని సాగిస్తూ ఉండే వారు. ఏ పని చేసినా దేవుని యందలి బయభక్తులతో ప్రార్థిస్తూ ప్రభువా ఈ దినమునకు అవసరమైన మేలులు మాకు దయచేయండి అని ప్రార్ధించేవారు. ఒక దినము కట్టెలు నరుకుతున్నప్పుడు గుర్రపు పిల్ల ఒకటి వాళ్ళ వెనకాల వచ్చేసింది. దాన్ని కట్టేసి ఆహారం పెట్టి ప్రేమతో పెంచుకున్నారు. కొన్ని నెలల్లోనే చక్కగా బలంగా ఎదిగింది ఆ గుర్రం. రధమునకు కట్టడానికి ఆ గుర్రము కావాలి అని దానిని కొనడానికి చాలామంది వచ్చారు కానీ ఆ యజమాని లేదు నేను దీనిని నా బిడ్డ వలె పెంచాను. దీనిని దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అని దానిని అమ్మడానికి ఇష్టపడలేదు. ఆ ఊరి వారందరూ కూడా తిట్టడం ప్రారంభించారు. ఈయనకు బ్రతుకుతెరువు తెలియదు అని అన్నారు. ఒక రోజు రాత్రి గుర్రం కనిపించకుండా పోయింది వెంటనే ఆ ఊరి వారందరూ ఆ విషయం తెలుసుకొని నవ్వుకున్నారు. కానీ ఆ యజమానుడైతే సమస్తమును మేలు కొరకే దేవుడు చేసేనని ఆయన ఏది చేసిన నా మేలు కొరకే చేయునని కృతజ్ఞత చెప్పియున్నారు.
ఒక రోజు తెల్లవారు జామున ఒక పెద్ద శబ్దం వినబడింది అది విన్న యజమానుడు తలుపు తెరిచి చూచినప్పుడు కనిపించకుండా పోయిన ఆ గుర్రంతోపాటు పన్నెండు గుర్రాలు వచ్చి నిలబడ్డాయి. దానిని చూచిన ఊరివాళ్లంతా ఆశ్చర్యపోయారు. గుర్రపు రేసుల కొరకు గుర్రపు సవారీ కొరకు గుర్రలకు తర్ఫీదు ఇచ్చారు. ఈ కార్యము ద్వారా దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడిపోకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్పుట వలన వీళ్ళు దీవించబడ్డారు అనే దానిని ఆ గ్రామ ప్రజలు గ్రహించారు.
బుజ్జి పిల్లలు మీరు కూడా మీ కుటుంబంలో ఏర్పడే కష్టమైన సమయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించుట నేర్చుకొనిన యెడల కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తారు. మీరు అలా కృతజ్ఞతలు చెల్లిస్తారు కదూ!
- సహోదరి. దేబోరా
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250