Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.06.2021
Share:

By Village Missionary Movement

Saturday, 26-Jun-2021

దిన ధ్యానము(Telugu) 26.06.2021

 

"నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా?" - యిర్మియా 45:5

 

ఘనత గల వ్యక్తిగా పేరు పొందాలి , సమాజంలోను, సంఘంలోను ప్రసిద్ధిగాంచిన వాడిగా ఉండాలి అనేది క్రైస్తవులందరికి గొప్ప శోధన. దీనిని మనలో ఎదగనిస్తే సాతాను యొక్క ఉచ్చులో మనం సులువుగా చిక్కుకుంటాం. 

 

యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూసిన యెడల తన యొక్క జీవితంలో ఎక్కువ భాగం వడ్రంగి వాడిగానే ఉన్నారు మరియు లోకంలో పెద్ద పట్టణములు అయిన రోమ్, ఏథెన్స్, అలెక్స్జాండ్రియా అనే స్థలమునకు వెళ్లి అక్కడ ఆయన ప్రసంగించడానికి ప్రయత్నించలేదు. ఆయన తిరిగిన నజరేతు అనేది ఒక చిన్న ఊరు. గలిలయ కూడా అల్పమైనదే గాని ఆయన ఒక అద్భుతము చేసిన తరువాత ఎవరికి దీని గురించి చెప్పకు అని చెప్పారు. ఆయన బైబిల్ పట్టలేనంతగా అద్భుత కార్యాలు చేశారు. అయినను ఎన్నడును దానిని గురించి ప్రచారం చేసుకోలేదు. కానీ మనం అయితే మనం చేసిన కార్యాలు చూపించి అనేకుల యొక్క ఆకర్షణను పొందుకొనుటకు ప్రయతించుచున్నాము. దేవుని కొరకు చేస్తున్న దేవాలయపు పనిలోను, సువార్త పనిలోను మనం గొప్ప వారిగా కనబడాలి అని ప్రయత్నించుచున్నాము. మన యొక్క సత్ కార్యాలను, తెలివి తేటలను ఎవ్వరు పట్టించుకోకుండ ఉంటే దానిని మనం సహించలేక పోతున్నాం. మరుగుగా ఉండే క్రైస్తవుడుగా ఎవ్వరు ఉండుటకు ఇష్ట పడటం లేదు. 

 

దేవుని సేవకుడైన టాఫి చెప్తున్న మాట. "ఇది దేవుని పరిచర్య ఇక్కడ మనిషి మరుగు చేయబడి దేవుడు మహిమ పరచబడాలి. దేవుని యొక్క పనిలో ప్రకటనలు అవసరం లేదు" అని చెప్పారు. చివరిగా ఆయన సమాధి పై రాయబడిన మాట " కనబడని వ్యక్తిగా ఉండగోరిన వాడు అయినను అందరికి కనిపించే వాడిగా జీవించిన వాడు " అని వ్రాయబడి ఉంది.

 

ప్రియమైన వారాలరా! అతిశయించే విషయంలో బాప్తిస్మము ఇచ్చే యోహాను తన జీవితంలో దూరంగానే ఉన్నాడు. దేవుడు హెచ్చింప బడవలసినది నేను తగ్గింపబడవలసినదై యున్నది అన్నది మాత్రమే ఆయన గురిగా ఉండేది. మన ఆలోచన ఎలా ఉన్నది? అందరి వలన అతిశయపడే క్రైస్తవుడిగా జీవించాలి అనుకుంటున్నవమా? క్రీస్తు యొక్క గొప్ప ఆలోచన కలిగిన వారుగా ఉంటున్నామా? మనలను పైకి తీసుకు రావడానికి ప్రభువు ప్రయత్నించే వరకు మనము మరుగైన చోటులో వేచియుందాం. క్రీస్తు వలన మాత్రమే ప్రేమించబడుటకును, ప్రోత్సహించబడుటకును ఆశిద్దాం. ఇతరుల ఎదుట మరుగు పడిన వాడిగాను, అల్పమైన వాడిగాను ఉండుటకు మనలను మనము కాపాడుకుందాం. ఆ విధంగా ఉండాలని ప్రార్దిద్దాం.

- బ్రదర్. విలియం మాక్ డోనాల్డ్

 

ప్రార్థన అంశం:-

పేద ప్రజలకు ఈ కరోన దినాలలో మనం చేయగలిగిన సహాయం చేస్తూ వస్తున్నాం. దీని ద్వారా ప్రజలు దేవుని ప్రేమను తెలుసుకొనేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş