Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.06.2026
Share:

By Village Missionary Movement

Sunday, 28-Jun-2026

దిన ధ్యానము(Telugu) 28.06.2026

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు 

 

అంశం:యేసయ్యను సంతోషపెట్టండి

 

"నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించువారితో నేను మాట్లాడగలను" - సామెతలు 27:11

 

గుర్రాల కాళ్ల చప్పుడు, ప్రజల కేకలు, మధురమైన సంగీతం, కంటికి రంగురంగుల దండలు, ద్వారం దగ్గర కాపలా కాస్తున్న బటులు... ఆ రాజభవనం అంతా కాంతితో, వైభవంతో వెలిగిపోతోంది. ఇది ఎక్కడిదో అని మీరు ఆలోచిస్తున్నారా? ఇది హేరోదు రాజుగారి రాజభవనం.

 

అది హేరోదు రాజు పుట్టినరోజు, ఆయనతో పాటు ఎంతోమంది అతిథులు, ముఖ్యమైన ప్రముఖులు (VIPs) విందులో కూర్చుని ఉన్నారు. అప్పుడు ఒక చిన్న అమ్మాయి మెరిసిపోయే దుస్తులు, కాళ్లకు గజ్జెలు కట్టుకుని వచ్చి, ఎంతో అందంగా నాట్యం చేసింది. ఆమె నాట్యం అక్కడ ఉన్నవారందరినీ ఆకట్టుకుంది; వారు ఆశ్చర్యపోయి ఆమెను ప్రశంసించారు. రాజు ఎంతో సంతోషించి, ఆమెతో, "నీకు ఎలాంటి బహుమతి కావాలి? నువ్వు నన్ను ఏది అడిగినా ఇస్తాను, నా రాజ్యంలో సగం వరకు అయినా సరే ఇస్తాను" అని చెప్పాడు.

 

ఆ మాట వినగానే ఆ చిన్న అమ్మాయి, ఏ బహుమతి అడగాలో తెలుసుకోవడానికి తన తల్లి దగ్గరకు పరుగెత్తింది. ఆమె తల్లి వెంటనే బాప్తిస్మమిచ్చు యోహాను తల అడగమని చెప్పింది. ఆ అమ్మాయి తన తల్లిని, "వద్దు అమ్మ, ఇంత మంచి రోజున ఒకరిని చంపమని ఎలా అడుగుతాం? ఇది దేవునికి నచ్చదు" అని ఎదురు ప్రశ్నించకుండా, తన తల్లి చెప్పినట్లే రాజు దగ్గరకు వెళ్లి ఆ దైవసేవకుడి తల కావాలని అడిగింది. ఇక రాజుకు వేరే దారి లేక, అతని తల నరికి ఆమెకు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అంతకుముందు సంతోషంగా ఉన్న రాజు హృదయం కాస్తా ఎంతో దుఃఖంతో నిండిపోయింది. తన నైపుణ్యంతో అక్కడ ఉన్నవారందరినీ అలరించిన ఆ అమ్మాయికి, దేవుడిని ఎలా సంతోషపెట్టాలో తెలియలేదు.

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి, మీకున్న తలాంతులు (talents), సామర్థ్యాలతో మీరు ఎవరిని సంతోషపెట్టాలని చూస్తున్నారు? యేసయ్యనా లేక ఈ లోకాన్నా? ఒక్క క్షణం ఆలోచించండి.

- శ్రీమతి. సారా సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet matbet holiganbet lunabet lunabet giriş atlasbet grandpashabet grandpashabet betcio holiganbet holiganbet giriş jojobet jojobet giriş betcio betcio medusabahis giriş perabet giriş matbet giriş perabet galabet perabet betcio betcio giriş madridbet madridbet giriş