Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.06.2021
Share:

By Village Missionary Movement

Friday, 25-Jun-2021

దిన ధ్యానము(Telugu) 25.06.2021

 

"నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను" - సామెతలు 4: 25

 

కన్ను శరీరమునకు వెలుగుగా ఉన్నది అయితే మన కన్నులు చెడ్డవిగా మారినప్పుడు అది మన ఆత్మీయ జీవితాన్నే చికటిలోనికి త్రోసి వేస్తుంది. ఈలాగు కంటి వలన పాపపు ఉచ్చులో చిక్కుకున్న కొందరి గురించి ఈ దినము మనము ధ్యానిద్దాం. 

 

హవ్వ :- మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలముతో పాటు ఏదేను తోటలో ఎన్నో రకములైన ఫలవృక్షములు ఉండేవి. కానీ హవ్వ దేవుని మాట నిర్లక్ష్యం చేసి తన కంటిని మంచి చెడు తెలివి నిచ్చు వృక్షఫలము పైన దృష్టి ఉంచింది. చూచుటకు రమ్యముగా ఉండిన ఆ పండును తెంపి, తిని తన భర్త అయిన ఆదామునకు ఇచ్చింది. ఫలితం (Inferiority complex) ఆత్మ గౌరవాన్ని తక్కువగా అంచనా వేసుకొనే స్థితి. దాని ద్వారా దాక్కోనుట, ఇతరుల పైన నేరం మోపుట చివరికి శాపంతో తోటనుండి బయటకు వెళ్లడం. ఎంత ఘోరమైన పరిస్థితి. ఈ దినము ఈ లోకంలో దేవుని వలన తృణీకరించబడిన అనేకమైన కార్యాలు కలవు. వాటి మీద మన దృష్టి పెట్టిన యడల ఆదాము హవ్వలను వెంబడించి వచ్చిన పాపము మనలను కూడా దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. కాబట్టి మీరు చూస్తున్న కార్యములలో శ్రద్ద కలిగి ఉండండి.

 

దావీదు :- దేవునికి హృదయాను సారమైన వ్యక్తి కానీ ఉరియా భార్య అందం పైన దృష్టిని పెట్టుట వలన తన కన్నుల దృష్టి ద్వారా దురాశ వచ్చింది. దేవుని కొరకు తెరిచియున్న దావీదు యొక్క హృదయపు తలుపులు మూయబడి ధైర్యముగా పాపము చేయుటకు ప్రేరేపించింది. చివరిలో ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆయన యొక్క పాపపు తెగింపును చెప్పే వరకు ఆయన హృదయము పాపము గురించి గ్రహించ లేదు. అవును మనం కూడా మన కంటి వలన ఇతరులకు కలిగిన దేనిని కూడా దురాశతో చూడకుండ మన దృష్టి పరిశుద్ధ దృష్టిగా ఉండనివ్వండి.

 

సమ్సోను:- తల్లి గర్భములో ఏర్పరచబడిన వాడు ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడా న్యాయాదిపతిగా పిలువబడిన వాడు. దేవుని ప్రణాళిక వైపు పరుగెత్తిన వాడు. మధ్యలో తిమ్నాతులో ఒక స్త్రీని "చూచి" (న్యాయాధిపతులు 14:1) వేశ్యను "చూచి" (16:1) పాపములో పడిపోయాడు. ఆ క్షణం నుండి ఆయన దర్శనం అంతా కూడా మారిపోయింది. కంటి దురాశలో పడిపోయిన సమ్సోను యొక్క కళ్ళు పెరికివేయబడి పిండి రుబ్బే పరిస్థితి ఏర్పడింది. బలవంతుడైనా ఆట వస్తువుగా మారిపోయే పరిస్థితికి త్రోసి వేయబడ్డారు. పరిపాలించిన చేతులు ఇప్పుడు రుబ్బురోలును త్రిప్పుతూ ఉంది కారణం కన్నులను అదుపు చేయక పోవటమే. 

 

దీన్ని చదువుతున్న మిత్రులారా! మీ యొక్క దృష్టి ఎలా ఉంది? చూపులో పరిశుద్ధత ఉన్నదా?

- శ్రీమతి. రూత్ అనిష్

 

ప్రార్థన అంశం:-

చివరి కాల ఉజ్జీవము కొరకైన ఆయుధాలను తయారుచేసే పనిలో ఉన్న మన సేవకులను దేవుడు ఇంకను వాడు కొనేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al