Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.06.2026
Share:

By Village Missionary Movement

Thursday, 18-Jun-2026

దిన ధ్యానము(Telugu) 18.06.2026

 

అంశం:ఆత్మ యొక్క దాహం

 

“…(యేసు) ‘నేను దప్పిగొనుచున్నాను’ అనెను” - యోహాను 19:28

 

యేసు సిలువ వేయబడినప్పుడు, ఆయన "నేను దప్పిగొనుచున్నాను" అని చెప్పారు. ఇది శారీరక దాహం కాదు; ఇది ఆత్మ యొక్క దాహం.

 

ఆయన పరిచర్య కాలంలో, తాను నీతిమంతులను కాదు గాని, పాపులను మారుమనస్సు పొందుటకు పిలువవచ్చితినని యేసు ప్రకటించారు (మత్తయి 9:13). అదేవిధంగా, బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను చూసినప్పుడు, "ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల!" అని ప్రకటించాడు (యోహాను 1:29). నిజంగానే, ఆయన ప్రత్యేకంగా ఆత్మల కోసమే వచ్చారు. ఆయన ప్రజలను చూసినప్పుడు, వారి ఆత్మల పట్ల భారముతో, కనికరముతో కలవరపడ్డారు. సిలువకు వెళ్ళేముందు, రాత్రి భోజన బల్ల వద్ద ఉన్నప్పుడు, తన్ను అప్పగించబోవుచున్న యూదా ఆత్మ పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, "ఆ మనుష్యునికి శ్రమ... ఆ మనుష్యుడు పుట్టక యుండినయెడల వానికి మేలు" అని చెప్పారు (మత్తయి 26:24). సిలువపై నలిగిపోతూ కూడా, తన్ను పరిహసించిన, చూసిన, ఏడ్చిన లేదా తన్ను అంగీకరించడానికి నిరాకరించిన ప్రజల గురించిన భారముతో ఆయన, "నేను దప్పిగొనుచున్నాను" అన్నారు. అందుకనే, ఆయన పునరుత్థానము తర్వాత, ఈ విధంగా ఆజ్ఞాపించారు "ఆకాశమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇవ్వబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు..." అవును, ప్రతి మానవ ఆత్మ ఎంతో విలువైనది. ఈ సర్వలోకాన్ని త్రాసులో ఒక వైపు ఉంచి, ఒకే ఒక్క ఆత్మను మరోవైపు ఉంచితే, ఆ ఒక్క ఆత్మకే ఎక్కువ విలువ ఉంటుంది. ఆ ఆత్మ విమోచన కోసమే యేసుక్రీస్తు సిలువపై తన్ను తాను అర్పించుకున్నారు. మనము ఈ విమోచనను ఉచితంగానే పొందాము, కానీ ఇది ఆయన నిష్కలంకమైన రక్తము చిందించడం ద్వారా కొనబడింది. దీనిని గ్రహించి, మన సొంత రక్షణను కాపాడుకుంటూ, ఇతరుల ఆత్మల పట్ల భారము కలిగి, యేసును ప్రకటిస్తూ, వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తూ, పనిచేద్దాం.

- శ్రీమతి. జెమీమా సౌందరరాజన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş grandpashabet hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş