By Village Missionary Movement
Wednesday, 17-Jun-2026దిన ధ్యానము(Telugu) 17.06.2026
అంశం: వారు గ్రహించలేకపోయారు
“నోవహు దినములు ఎలా ఉండినవో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును” - మత్తయి 24:37
మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవసారి తిరిగి వచ్చినప్పుడు, ఈ లోకం నోవహు దినములలో ఎలా ఉండినదో అలాగే ఉంటుంది. మత్తయి 24:38 లో ప్రభువు ఆ దినముల స్వభావాన్ని వివరించారు. మొదటిగా, ప్రజలు తింటూ, తాగుతూ ఉండిరి. ఇది దైనందిన జీవితంలో ఒక భాగాన్ని సూచిస్తుంది; ఇక్కడ "తాగుట" అని ప్రస్తావించడం భోజనంలో భాగంగా పానీయాలు సేవించడాన్ని సూచిస్తుంది తప్ప, మద్యపానాన్ని కాదు. తరువాతిగా, అదే వచనంలో ప్రభువు "పెండ్లిచేసికొనుచు పెండ్లికియ్యబడుచు" అని చెప్పినప్పుడు, ఆయన వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నారు తప్ప, లైంగిక అనైతికత వంటి పాపాల గురించి కాదు.
మరో మాటలో చెప్పాలంటే, నోవహు దినములలో ప్రజలు దైనందిన జీవితం, ఆహారం మరియు వివాహం వంటి నిరపరాధమైన (సాధారణ) పనులలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ, వారు తమ జీవితాల్లో తమ సృష్టికర్త అయిన దేవుడిని వెదకలేదు. ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
ప్రియమైన స్నేహితులారా! మనము కూడా ఇదే విధమైన ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. మనము ఆహారం, ఉద్యోగం, కుటుంబం మరియు వివాహం వంటి రోజువారీ విషయాలపై ఎంతగానో దృష్టి పెట్టవచ్చు, దీనివల్ల మన ప్రభువైన యేసుక్రీస్తుతో ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేసి, ఆయనను మన జీవితాలకు కేంద్రబిందువుగా చేసుకోవడంలో విఫలం కావచ్చు. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలని ఈ వాక్యం మనకు గుర్తుచేస్తోంది.
- బ్రదర్. సంతోష్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250