Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.06.2026
Share:

By Village Missionary Movement

Wednesday, 10-Jun-2026

దిన ధ్యానము(Telugu) 10.06.2026

 

అంశం: యేసుకే ప్రథమ స్థానం

 

“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి…” - మత్తయి 6:33

 

ఒక రాజు నగలు, విలువైన రత్నాలతో నిండిన పెట్టెను తీసుకుని తన రాజప్రావాసానికి ప్రయాణమౌతున్నాడు. ఆయన ఒక ఏనుగుపై కూర్చుని ఉండగా, ఆయన రక్షణ కోసం చుట్టూ సైనికులు, మంత్రులు ఉన్నారు. హఠాత్తుగా, ఆ ఏనుగు కాలు జారడంతో ఆ పెట్టె క్రిందపడిపోయింది. ఆ పెట్టె మూత ఊడిపోయి, అందులోని వస్తువులన్నీ చెల్లాచెదురైపోయాయి; బంగారు నాణేలు, విలువైన ముత్యాలు అన్ని వైపులా దొర్లిపోయాయి. రాజు ఏం ఆజ్ఞాపిస్తాడో తెలియక అందరూ నిశ్చేష్టులై నిలబడ్డారు. ఆ రాజు చాలా దయాళువు, ఉదార స్వభావం కలవాడు. క్షణకాలం ఆలోచించి ఆయన, "ఇదంతా మీదే. మీకు నచ్చింది తీసుకోండి" అన్నాడు. రాజుగారి సేవకులు, మంత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ సంపదను ఏరుకోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగెత్తారు.

 

అప్పుడు, రాజుగారి చూపు తన పక్కనే నిలబడి ఉన్న ఒక సైనికుడిపై పడింది. ఆ సైనికుడు ఒక్క క్షణం కూడా రాజు వైపు నుండి తన చూపు తిప్పలేదు, తన చేతిలోని బల్లెం కూడా వదల్లేదు. రాజు ఆశ్చర్యపోయాడు. "నీ కుటుంబం కోసం ఈ విలువైన వస్తువులను తీసుకోవాలని నీకు లేదా?" అని అడిగాడు.

దానికి ఆ సైనికుడు, "మహారాజా, మిగిలిన వారందరి కళ్ళు ఆ రత్నాలపైనే ఉన్నాయి. అందరూ వాటిని ఏరుకోవడంలో నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవరైనా మీకు హాని తలపెడితే ఏంటి పరిస్థితి? అందుకే నా కళ్ళు మీ పైనే ఉంచాను. ఆ రత్నాల కంటే మీరే నాకు ఎంతో విలువైనవారు" అని బదులిచ్చాడు. రాజు ఎంతో సంతోషించి, అతడిని తన వ్యక్తిగత రక్షకుడిగా పదోన్నతి కల్పించడమే కాకుండా, ఆ నగలను, వజ్రాలను, ముత్యాలను అతడికే బహుమతిగా ఇచ్చాడు.

 

ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో దేనికి మొదటి స్థానం ఇస్తున్నాం? ఆ సేవకుడి కళ్ళు తన రాజుపైనే నిలిచి ఉన్నాయి. మరి ఈరోజు మన కళ్ళు ఎవరిపై లేదా దేనిపై నిలిచి ఉన్నాయి? మనం ఈ లోక ఆశీర్వాదాల వెనుక పరుగెడుతున్నామా, లేక మన చూపు దేవునిపై ఉందా? మన హృదయం రోజురోజుకీ దేనిని ఆశిస్తోంది? ఒక లోకపు రాజే ఆ సేవకుడి నమ్మకత్వాన్ని బట్టి అతనికి పదోన్నతితో పాటు వెండిబంగారాలను ఇవ్వగలిగితే, మన రాజు అయిన యేసుప్రభువు ఈ జీవనానికి మరియు నిత్యజీవానికి కావలసిన ప్రతిదానిని మనకు మరెంతో నిశ్చయముగా దయచేస్తారు! కాబట్టి, మన కళ్ళను యేసు వైపు తిప్పుదాం. ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇద్దాం. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక!

- రెవ. ఎస్.ఎ. ఇమ్మానుయేల్ గారు 

 

ప్రార్థన అంశం:

భారతదేశమంతటా 7,000 మంది మిషనరీలు లేపబడాలని ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al grandpashabet grandpashabet grandpashabet grandpashabet giriş grandpashabet grandpashabet güncel giriş grandpashabet grandpashabet güncel grandpashabet grandpashabet giriş grandpashabet giriş grandpashabet grandpashabet grandpashabet holiganbet starzbet giriş grandpashabet holiganbet holiganbet giriş pusulabet pusulabet giriş meritking meritking giriş holiganbet holiganbet giriş grandpashabet jojobet palacebet cratosroyalbet radissonbet palacebet wbahis cashwin 1win betpuan perabet perabet giriş perabet perabet giriş sahabet onwin perabet perabet giriş betcio betcio giriş atlasbet atlasbet giriş casibom casibom giriş egebet matbet holiganbet meritking holiganbet holiganbet holiganbet giriş