By Village Missionary Movement
Thursday, 24-Jun-2021దిన ధ్యానము(Telugu) 24.06.2021
"నీయందు నేను నమ్మిక యుంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము” - కీర్తనలు 143:8
తెల్లవారక మునుపు చీకటి కమ్మియున్న ఉదయ కాలపు సమయం ప్రభువుతో సంభాషించుటకు ఒక అద్భుతమైన సమయం. మనుష్యుల యొక్క మొఖం చూచుటకు మునుపు ప్రభువు యొక్క సన్నిధిని వెతుకుతూ ఆ దినమునకు దేవుని ప్రణాళికను గ్రహించి దేవుని కృపను పొందుకొనుటకు వేచి యున్న ఆ సమయమే విజయం పొందుకునే సమయం. నిజముగా ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఇది క్రమంగా ఉండిన యడల ఆయన కచ్చితంగా లోకాన్ని జయిస్తాడు.
మన యొక్క రక్షకుడైన యేసు క్రీస్తు కూడా ఉదయమునే లేచి తండ్రి సన్నిధికి వెళ్లారు. తండ్రి యొక్క చిత్తాని ప్రణాళికను తెలుసుకున్నారు. దాని ప్రకారం అద్భుత కార్యాలు చేస్తూ సాతానుని సులువుగా జయించారు. మరియు బైబిల్ లో గల పరిశుద్ధులు తమ శత్రువులను సంహరించుటకు, దేశములను స్వతంత్రించుటకు ఉదయమునే లేచి వెళ్లిన దానిని చదువుతున్నాం.
ప్రాముఖ్యంగా యెహోషువాపాతు అనే యూదా రాజుకు వ్యతిరేకంగా యుద్ధం చేయుటకు మోయాబు, ఆమోరీయులు చూచినప్పుడు ఆయన మిక్కిలి కలత చెందారు. అయినను రాజును, దేశ ప్రజలను తమ దృష్టిని దేవుని వైపు మళ్ళించి తమ చేతులను ఆయన వైపు చాపి ప్రార్థన చేసారు. జవాబుగా దేవుడు బయపడకండి, ఈ యుద్ధం మీది కాదు ఈ యుద్ధం నాది అన్నారు. జరిగినది ఏమిటి వాళ్ళ శత్రువులను సంహరించుటకు ఉదయమునే లేచారు. దేవుని స్తుతించి పాడే పాటల గుంపులను సైనికులకు ముందుగా నిలబెట్టారు. స్తుతి చేయడం ప్రారంభించినప్పుడు శత్రువులు తమలో తాము నరుకుకొని చంపబడ్డారు. ఎంత పెద్ద విజయ నాధము.
ప్రియమైన వారలారా శత్రువు అయిన సాతాను మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడా? మిమ్మల్ని చంపేస్తాను సవాలు విసురుతూ ఉన్నాడా? లేదా మనుష్యులు మీకు వ్యతిరేకంగా లేచియున్నారా? కలత చెందకండి. దేవుడు మనకు తోడుగా నిలబడి యున్నప్పుడు మనము చింతించనేల? యుద్ధం యెహోవాది కదా! మనం చేయవలసినది అంత ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నిలబడాలి. అవును ఉదయాన్నే చేస్తున్న ప్రార్థన ప్రాముఖ్యమైనది. మిక్కిలి చీకటి కలిగిన ఆ సమయం మిక్కిలి మహిమగల సమయం. ఉదయకాలపు ప్రార్థన విజయమును తీసుకు వచ్చును. ఉదయాన్నే లేచే అనుభవాన్ని అబ్యాసం చేసుకొని విజయ యోధులుగా జీవించి ముందుకు వెళదాం.
- ఎస్. మనోజ్ కుమార్
ప్రార్థన అంశం:-
దిన ధ్యాన సందేశమును చదువుతు మేలులు పొందుకున్నవారు సత్యనుసారంగా నడుచుకొని సాక్షిగా జీవించేటట్లు ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250