Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.05.2026
Share:

By Village Missionary Movement

Saturday, 23-May-2026

దిన ధ్యానము(Telugu) 23.05.2026

 

అంశం: దీనమనస్సును వస్త్రముగా ధరించుకొనుడి

 

“స్వరూపమందు మనుష్యుడుగా కనబడి, తన్నుతాను తగ్గించుకొని, దాసుని రూపమును ధరించుకొని, మనుష్యుల పోలికగా పుట్టెను” - ఫిలిప్పీయులకు 2:7

 

నేను చిన్నప్పుడు ఒక రాజు గురించిన కథ చదివాను. ఆ రాజు సామాన్య పౌరుడిలా వేషం మార్చుకుని, తన ప్రజలను కలవడానికి తన రాజ్యంలో తిరిగేవాడు. ఆయన ధరించే ప్రత్యేకమైన విగ్గు (కృత్రిమ జుట్టు), సాధారణ బట్టలు ఆయన రాచరిక గుర్తింపును దాచి, ఒక సామాన్య మనిషిలా కనిపించేలా చేసేవి. ఈ విధమైన మారువేషంలో ఆయన తరచుగా నగరాలు, పట్టణాలను సందర్శించడం వల్ల, తన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వాటిని త్వరగా పరిష్కరించగలిగేవాడు. వారి అవసరాలను తీర్చగలిగేవాడు.

 

మన పాపముల సమస్యను పరిష్కరించడానికి, మన సృష్టికర్త అయిన దేవుడు తన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టాడు; “యేసు” అనే నామముతో ఆయన తన్నుతాను రిక్తునిగా చేసుకొని, దాసుని రూపమును ధరించి, మనుష్యుల పోలికగా ఈ లోకానికి వచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు ఈ భూమిపైకి మనుష్యుడిగా వచ్చాడు. యేసు ఈ భూమిపై మనుష్యుడిగా జీవించి, మనం ఎదుర్కొనే అన్ని శ్రమలను, శోధనలను, కష్టాలను అనుభవించాడు. అయినప్పటికీ, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయాలను మనకు బోధించాడు. ఆయన మనుష్యుడి రూపంలో కనబడి, తన్నుతాను తగ్గించుకొని, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా దేవునికి విధేయత చూపాడు. మనలను పాపముల నుండి, శాపముల నుండి విడిపించడానికి ఆయన సిలువపై మరణించాడు. మన కోసమే ఆయన మూడవ రోజన తిరిగి లేచాడు. దేవుడు ఆయనను అన్నిటికంటే పైగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.

 

మనం క్రీస్తు ద్వారా ఆదరణను, కనికరాన్ని పొంది ఉన్నాము కదా, మరి మనం కూడా మన రక్షకుని వలె దీనమనస్సుతో (నమ్రతతో) జీవిస్తున్నామా? ఫిలిప్పీయులకు 2:3 ప్రకారం, మనం స్వార్థంతో గానీ, వృథాతిశయంతో గానీ ఏ పనినీ చేయకూడదు. దానికి బదులుగా, ఒకరినొకరు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి.

 

ప్రియమైనవారలారా, మనం ఇతరులను ప్రేమించి, వారికి సేవ చేయడానికి క్రీస్తు కలిగియున్న మనస్సును అలవర్చుకుందాం మరియు మనలను మనం తగ్గించుకుందాం. అటువంటి మనస్తత్వాన్ని సాధించడానికి మనం కృషి చేద్దాం. యేసుక్రీస్తు చేసిన త్యాగానికి మనం నిజంగా కృతజ్ఞత చూపిస్తున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. క్రీస్తు యేసునకు ఉండిన యీ మనస్సు మనలోనూ ఉండునట్లు మనం నిరంతరం ప్రార్థిద్దాం.

 

“మనుష్యుడా, ఉత్తమమైనదేదో ఆయన నీకు తెలియజేసియున్నాడు; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవునితో కూడ నడుచుకొనుటయే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు?” - మీకా 6:8

 

- ఎ. బ్యూలా గారు

 

ప్రార్థన అంశం:

 జార్ఖండ్ రాష్ట్రంలో 10 సంఘాల (చర్చీల) నిర్మాణానికి కావలసిన అవసరతలు తీర్చబడాలని దయచేసి ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş grandpashabet hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş