Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.06.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 22-Jun-2021

దిన ధ్యానము(Telugu) 22.06.2021

 

"ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును” – హెబ్రీయులకు 10:37

 

నరకంలో సాతాను సమూహము యొక్క కూటమి ఒకటి జరుగుతుంది. దాంట్లో ప్రజలు రక్షణ మార్గంలో నడవకుండా ఆటంక పరచుట ఎలాగు అని ప్రణాళిక వేయబడింది. మొదటి వరుసలో కూర్చున్న సాతాను ఈ విధంగా చెప్పింది అసలు దేవుడే లేడు అనే సందేశాన్ని మనం అందరికి చెబుదాం అన్నది. మిగతా వారు అందరూ దానికి ఇది ముందే చాలా మంది ప్రజలు చెబుతూ వస్తున్న పాత కార్యమే కొత్త సందేశం కాదు అన్నది. మరి యొక సాతాను నరకమే లేదు అనే సందేశాన్ని పంపిస్తామా అన్నది అందుకు మిగిలినవి అలాగైతే పరలోకం గురించి ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కదా! అందుకని ఇది సరైనది కాదు అన్నవి. మరియొక సాతాను యేసుక్రీస్తు మరల వచ్చుటకు ఆలస్యం అవుతుంది అనే సందేశాన్ని ప్రజలలో విస్తరింప చేద్దామా అని అడిగింది అందుకు మిగతావన్నీ అవును ఇది క్రైస్తవులకు నచ్చిన సందేశం అని సాతానులందరు అంగీకరించాయి.

 

లోకం యొక్క ముగింపు దగ్గరగా ఉన్న ఈ కాలంలో ఏ క్షణమైనా క్రీస్తు యొక్క రాకడ ఉండవచ్చు అని అనేకులు నమ్మిన ఇంకా కొందరు ఆ నమ్మకం లేకుండా ఉన్నారు. మనిషి దేవుని రాకడను నమ్మినా నమ్మక పోయిన అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదిగో న్యాయాదిపతి వాకిటలో నిలబడియున్నారు (యాకోబు 5:9). అన్నింటికీ ముగింపు సమీపమాయెను (1పేతురు4:7) అనే వాక్యాలు ఆయన రాకడ ఆలస్యం కాదు అనే దాన్ని మన హృదయంలో మనకు గుర్తు చేస్తూ ఉంది. మనము మన నడకలోను, ప్రవర్తనలోను అన్నింటిలో కూడా పరిశుద్ధులుగాను క్రీస్తుని ఎదుర్కొనుటకు సిద్ధము గల వారిగా కనబడాలి. ఈ లోకములో మనము చేయగలిగిన బాధ్యత గల కార్యాలు ఏదైనా పరిచర్య లేదా పనో దానిని చురుకుగాను, యదార్థముగాను నెరవేర్చుటకు మనం ముందుకు రావాలి.

 

ప్రియమైన వారలారా మన ఇంటికి రేపు ఒక బంధువు వస్తున్నారు అంటే ఇంటిని శుభ్రంగా బాగుచేస్తాం. రేపు వంటకు అవసరమైన అన్నింటిని కొనేసి పెట్టుకుంటాం. నిజంగా నేను త్వరగా వస్తున్నాను ప్రకటన 22:20 అని చెప్పిన యేసుక్రీస్తును ఎదుర్కొనుటకు మనకు సిద్దపాటు ఎంత వరకు ఉన్నది? ఆలోచిద్దాం. దేవుని రాకడ ఆలస్యం అవుతుంది అనేది సాతాను యొక్క తంత్రము. కాబట్టి ఎప్పుడు మన నడుము కట్టుకొని సిద్ధపడి మనం వెలుగుతూ ఉండి యజమానుని యొక్క రాక కొరకు సిద్ధపడి వేచి ఉందాం. దేవుని బూర ధ్వని విన్నప్పుడు మధ్య ఆకాశంలో ఆయనను ఎదుర్కొనుటకు వెళ్లి యుగయుగములు, తరతరములు ఆయనతో జీవిద్దాం.

- కె. మణిమొలి

 

ప్రార్థన అంశం:-

ఇంకా మన పరిచర్య కొరకు భారంగా ప్రార్ధించే, విరివిగా కానుక ఇచ్చే సపోర్టర్స్ ను దేవుడు దయచేయునట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al