Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.06.202
Share:

By Village Missionary Movement

Monday, 21-Jun-2021

దిన ధ్యానము(Telugu) 21.06.2021

 

"సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ" - 1కోరింథీయులకు 9: 16

 

ప్రపంచంలోనే పరిశుద్ధ బైబిల్ తరువాత అత్యధికముగా పేరుపొందుకున్న మరియు అమ్ముడుపోతున్న పుస్తకము జాన్ బనియన్ రాసిన మోక్ష ప్రయాణము. ఈయన దీనిని 1675 వ సంవత్సరంలో చెరసాలలో నుండి రాసారు. ఆయన జీవించిన కాలంలో యేసుక్రీస్తు గురించి ప్రసంగించాలి అంటే ప్రభుత్వం నుండి అధికారము పొందుకొని చేయాలి. కానీ జాన్ బనియన్ ఈ చట్టం గురించి బాధ పడకుండా అన్ని ప్రాంతాలు తిరిగి రక్షణ గురించి ప్రసంగిస్తూ వచ్చారు. కాబట్టి ఆయన చెరసాలలో వేయబడ్డారు. ఇక ప్రసంగించను అని చెప్పిన యెడల చెరసాల నుండి విడుదల పొందుటకు అవకాశం ఉంది అని ఆయనకు తెలిసినా ఆయన దాని గురించి ఆలోచించనే ఆలోచించలేదు.

 

ఒకరోజు చెరసాలలోనికి ఆయన కుమార్తె ఆయనను చూచుటకు వచ్చింది. చినిగిపోయిన బట్టలతో, సన్నబడిన శరీరంతోను వచ్చిన తన కుమార్తెను చూసిన వెంటనే ఆయన కళ్ళలో నుండి కన్నీళ్ళు కారడం ప్రారంభించాయి. కుమార్తె తన తండ్రి యొక్క దుఃఖకరమైన పరిస్థితిని చూసి ఈ విధముగా అన్నది. నాన్న ఇంట్లో అందరూ చాలా పేదరికంలో ఉన్నాం అమ్మ నన్ను మీ వద్దకు పంపించారు ఇక ప్రసంగించ వద్దు. నాన్న ఇంటికి వచ్చేయండి అని కన్నీటితో చెప్పింది. అందుకు జాన్ బనియన్ హృదయం కదల్చబడింది. కుమార్తెను హత్తుకుని ఆమె యొక్క బుగ్గ పైన ముద్దు పెట్టి ప్రియ కుమార్తె ప్రభువు యొక్క ప్రేమను నశించిపోతున్న మానవ జాతికి నేను ఎలాగూ ప్రకటించకుండా ఉంటాను నీవు వెళ్లుము ప్రభువు మిమ్మల్ని కాపాడతారు అని చెప్పి పంపించారు.

 

అవును అపోస్తులుడైన పౌలు వలె, జాన్ బనియన్ వలె సువార్త ప్రకటించుట నా మీద ఉన్న బాధ్యత అనే తలంపు ప్రతి ఒక్కరికి ఉండాలి. సేవకుడు మాత్రమే దీనిని చేయాలి అన్నది కాదు యేసు క్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ప్రకటించే తీరాలి. సమయం దొరికినా, దొరకకపోయినా, పరిస్థితులు అనుకూలించిన అనుకూలించక పోయినా సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 

 

ప్రియమైన వారలారా! యేసు క్రీస్తు రాకడ సూచనలు నెరవేరుతు వస్తున్న దానిని చూస్తున్నాం. ముగింపు సమిపముగా ఉన్నది. మనుష్యు కుమారుడు వచ్చే చివరి ఘడియలలో మనం ఉన్నాం. కానీ ఇంకను ప్రభువుని ఎరగని ప్రజలు అనేకులు మన చుట్టూ కలరు. వాళ్లకు న్యాయ తీర్పు గురించి, పరలోకం, నరకం గురించి ప్రకటించ వలసిన బాధ్యత మన మీద ఉంది కదూ! దీనిని గ్రహించిన వాళ్లుగా దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడదాం. ఆకరి ఊపిరి వరకు సువార్తను ప్రకటించే ఆలోచనలో జీవిద్దాం.

- శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్

 

ప్రార్థన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న నిర్మాణ పనులకు అవసరమైన ధనసహాయం అందేటట్లు, దేవుని జ్ఞానముతో త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయబడేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al