Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.06.2021 (Kids Special)
Share:

By Village Missionary Movement

Saturday, 19-Jun-2021

దిన ధ్యానము(Telugu) 20.06.2021 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్నపిల్లలకు

 

"నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును" - కీర్తనలు 119: 16

 

ఒరేయ్ రాబర్ట్ ఇక్కడికి రా నాకు సహాయం చెయ్ వీధి కుళాయి నీళ్లు వస్తున్నాయి రెండు బిందెలు పట్టుకుని రా !అన్నారు అమ్మ. సరే అమ్మ! అని నీళ్లు పట్టుకోని రావడానికి వెళ్లాడు రాబర్ట్ వెళ్లే మార్గము లోనే తన వేళ్ళను తుపాకీ వలే డిష్యుమ్ డిష్యుమ్ అని కాల్చుకొనివెళ్ళాడు రాబర్ట్ కి సైన్యమునకు వెళ్లాలని ఆశ తను ఒక్క సైనికుడు కావాలని తన తల్లి తో తరచుగా చెప్పుతుండేవాడు రోజూ బైబిల్ చదవాలి తమ్ముడు అప్పుడే నీవు ఎక్కడి కి వెళ్లిన యేసయ్య నీకు తోడుంటారు అనిన వెంటనే రాబర్ట్ వెళ్ళమ్మా నీకు వేరే పని లేదా అని హేళన చేస్తుంటాడు. యేసయ్య రాబర్ట్ ను ఎలాగైనా మీ మార్గములో నడిపించండి అనిఅమ్మ ప్రార్ధిస్తూ ఉంటారు

 

కొన్ని సంవత్సరాల తర్వాత రాబర్ట్ ఆశించినట్లుగానే సైనికుడిగా సెలెక్ట్ అయ్యాడు సంతోషముతో సిద్ధపడ్డాడు అమ్మ రాబర్ట్ కి కావలసిన వాటన్నిటిని కొని పెట్టి ఒక క్రొత్త నిబంధన కూడా ఇచ్చి నీ జేబులో ఎప్పుడుదీన్ని పెట్టుకొనుము రోజూ బైబిల్ చదవడం మరచిపోకు అన్నారు సరేఅని రాబర్ట్ బైబిల్ తీసుకొని తన జేబులో పెట్టుకొన్నడు ఒక్క రోజు యుద్ధం లో రాబర్ట్ ను కాల్చివేశారు అంతే అంతా అయిపోయింది అని అనుకున్నాడు లేచి చూస్తే ఎలాంటి గాయం తగలలేదు బైబిల్ చదవక పోయినను జేబులో ఎప్పుడు చిన్న క్రొత్త నిబంధనను పెట్టుకొని ఉండేవాడు తుపాకీ తూటా ఆ బైబిల్ కు తగిలి నిలబడిపోయిది బైబిల్ తెరిచాడు ఆ తూటా యోహాను సువార్త 3:16 వరకు దూరి ఉండి పోయింది

 

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను". అనే వాక్యాన్ని చదివాడు యేసుక్రీస్తుయొక్క ప్రేమను గ్రహించు కొన్నాడు ఆ దినము నుండి ఆశక్తితో బైబిల్ ను చదవడం ప్రారంభించాడు చిన్న వయస్సు లోనే అమ్మ చెప్పిన దానిని వినలేదే అని బాధ పడ్డాడు రాబర్ట్ యొక్క మారుమనస్సు ను తల్లితో పంచు కొన్నాడు అమ్మ పొందుకొన్న సంతోసానికి ఎల్లలు లేవు రాబర్ట్ ఉంటున్న స్థలములో సాక్షి గా జీవించడం ప్రారంభించాడు 

 

ఏంటి పిల్లలు! ఎప్పుడు చూసిన బైబిల్ చదువు ప్రార్ధన చేయూ అని చెప్పుతూ ఉంటున్నారని అని ఆలోచిస్తున్నారా బైబిల్ చదివి ప్రార్దించడంవలన దేవుడుతో నీవు సంబాషించగలవు ఇలా జీవిస్తేనే దేవుని రాకడ కొరకు సిద్దమవ్వగలము ఈ లోకపు జీవితం ముగించబోతుంది కానీ పరలోక జీవితం ఎన్నడూముగించబడదు అది నిత్యమైనది ఈ నిత్య జీవం కొరకు బైబిల్ చదివి ప్రార్ధించాలి సరేనా? రడీగా ఉన్నారా? 

- సిస్టర్ జ్యోతి స్టాన్లీ

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al