Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.06.2021
Share:

By Village Missionary Movement

Saturday, 19-Jun-2021

దిన ధ్యానము(Telugu) 19.06.2021

 

"జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" - 1కోరింథీయులకు 1:28

 

ఈ లోకంలో తమ పిల్లలకు జీవిత భాగస్వామును ఎంచు కొనేటప్పుడు మంచి అర్హతకలిగిన వాళ్ళను ఎంచు కొనుటకే అందరూ ఆశిస్తుంటారు. సైన్యమునకు వ్యక్తులను ఎంచుకునేటప్పుడు మంచి శరీర బలము, మంచి అర్హతకలిగిన వాళ్లనే ప్రభుత్వం ఎంచుకుంటుంది. కానీ ప్రభువు కొరకు వ్యక్తులను ఏర్పరుచుకున్న విధము మిక్కిలి భిన్నంగా ఉంటుంది అనే దానికి "క్రిస్మస్ ఇవాన్స్" అనే దేవుని దాసుడు మిక్కిలి శ్రేష్ఠమైన ఉదాహరణ.

 

వేల్స్ దేశానికి చెందిన ఈయన పేదరికంలో పుట్టి పెరిగాడు. తండ్రిని కోల్పోయి దుర్మార్గుడు అయిన మేనమామ వలన 6 సంవత్సరాలు పెంచబడి చాలా ఉపద్రవాలు ఎదుర్కొని నడిచారు. దాని వలన తన కుడి కన్ను కోల్పోయారు. ఆ కన్ను ఉన్న స్థలంలో చిన్న కన్నం మాత్రమే ఉంటుంది. ఆకర్శించే శరీర రూపం లేని వక్తి. 17 సంవత్సరం వరకు చదువుకోలేదు. ప్రజల దృష్టికి అల్పుడుగా, నీచంగా ఎంచబడ్డాడు. దేవుడు ఈయనను ఏర్పరచుకొని తన పరిచర్యలో బలంగా వాడుకున్నారు.

 

17వ ఏటా ఒక బోధకుడి దగ్గర పనికి వెళ్ళినప్పుడు రక్షించబడ్డాడు. చాలా త్వరగా రాయడం, చదవడం నేర్చుకోనుటకు ప్రభువు దయ చూపించారు. పేదల యొద్ద గృహకుడికలు, ప్రార్థనలు నడిపించడం ప్రారంభించారు. పుస్తకాలలో గల ప్రసంగాలను కంఠత పెట్టి పరిచర్యలో వాడేవారు. ప్రసంగించుట, పాడుట అనే తలంతును తమ రక్తంలోనే కలిసి ఉండినట్టు ఉండే వేల్స్ దేశ ప్రజలకు సంవత్సరంనకు ఒకసారి ప్రసంగ పండుగ ఒకటి జరరగుతూ ఉంటుంది . దాంట్లో సుమారు 25 వేల మంది వరకు జనాలు కూడుకుంటారు. దింట్లో ఇవాన్స్ కు ప్రసంగించడానికి ప్రభువు అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి ప్రసంగంలోనే ప్రభువు అగ్ని జ్వాలగా అతనిని వాడుకున్నారు. ఒంటి కన్ను ప్రసంగికుడిగా పిలవబడిన ఆయన గురించిన మాటే అక్కడికి వచ్చిన అందరి మాటగా ఉండేది. బలమైన ఉజ్జివం ఏర్పడింది. ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు గుంపులు గుంపులుగా రావడం ప్రారంభించారు. చనిపోయినట్లు కనిపించిన ఆత్మలు, సంఘములు పునర్జీవం పొందుకున్నాయి, ఇవాన్స్ సాదరణముగా ప్రార్ధించే ప్రార్థన యోధుడు. బైబెల్ చదువుట, ఆత్మీయ పుస్తకాలు చదువుటయే ఆయనకు ఊపిరిగా ఉండేది. సువార్త ప్రకటించుటకు కఠినమైన స్థలములను ఎంచుకుంటారు. వ్యతిరేకతలు మధ్యలో ప్రజలను రక్షించుటకు దేవుడు అతనిని వాడుకున్నారు.

 

క్రిస్మస్ ఇవాన్స్ మరణించినా కూడా మాట్లాడుతున్నారు. మన యొక్క అర్హతలు దేవునికి అవసరంలేదు,మన యొక్క సమర్పణ ఆయనకు ప్రాముఖ్యం. కాబట్టి ఎలాంటి సమస్యలు ఎదురైన నిరుత్సాహ పడకుండా మనలను తన చేతిలో పెట్టుకొని వాడుకొనుటకు ప్రభువు చేతికి సంపూర్ణముగా సమర్పించుకుందాం. దేవుని రాజ్యం విస్తరించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. 

- శ్రీమతి. గీత రిచ్చర్డ్.

 

ప్రార్థన అంశం:-

ప్రతి జిల్లాలోను యవ్వనస్తుల కూడికలు జరిపించేటట్లు దేవుడు కృప చూపేటట్లు ప్రార్దిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet