Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.06.2021
Share:

By Village Missionary Movement

Friday, 18-Jun-2021

దిన ధ్యానము(Telugu) 18.06.2021

 

నీటిని దాటి వచ్చాము.

 

"నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు" - కీర్తనలు 91:13

 

మనము నిలబడినది అంతరించి పోకుండా ఉండుట యెహోవా కృపయే. ఈ రోజు ప్రపంచం అంత కరోనా అనే వ్యాధితో బాధపడుతున్నారు. చాలా మంది ఆ వ్యాధితో బాధపడుతు ప్రాణం కొరకు పోరాడుతున్న వారు అనేకమంది. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మోతాదు తగ్గి పోరాడేలా చేస్తుంది ఈ వ్యాధి. మనకు ఎక్కడ వస్తుందేమో అనే భయంతో ప్రజలు జీవిస్తున్నారు. ఈ కరోనా రెండవ దశలో చిక్కిన వారు అనేక మంది. మిగిలిన వారు చిక్కిపోకూడదు అనే బయముతో కలతతో జీవిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకైన మొదటి గుర్తింపుగా పరిశుద్ధ గ్రంధమైన బైబిల్లో చెప్పబడింది. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములును గొప్ప సూచనలును పుట్టును అని లూకా 21: 11 లో వ్రాయబడి ఉంది.

 

 కొన్ని రోజులకు ముందు నేను మా అమ్మగారు కరోనా వ్యాధి వలన బాదింపబడి హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి వచ్చాము. శరీరము మిక్కిలి బలహీనమైనది, ఎక్కడో లోతుగా వెళ్తున్నట్లు అనిపించింది. ప్రభువా మీరు ఎక్కడ ఉన్నారు? నా చేయి పట్టుకోండి, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అనే వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్ధించాను. నీటిని అగ్నిని దాటి వచ్చినట్లు మేము కరోనా వ్యాధిని దాటి వచ్చాము. ప్రభువా నేను ఇంకా మీ కొరకు పరిచర్య చేయాలి అను కుంటున్నాను నన్ను వాడుకోండి అని అరచి ప్రార్ధించాను. ప్రభువు ఇదిగో నేను నీతో కూడా వున్నాను నీవు బయపడవద్దు అనే తన వాక్యం ద్వారా ఆయన మమ్మల్ని బలపరిచారు. నన్ను మరియు 93 సంవత్సరాలు వయస్సు గల నా తల్లిని కరోనా వ్యాధి చేతిలోనుండి విడిపించి ఇంటికి క్షేమంగా తోడుకొని వచ్చారు. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! అవును కరోనా వంటి సింహముల మీదను, పాముల మీద నడిపించే దేవుడు మనకు సహాయం చేస్తారు. ఈ వ్యాధి తాకకుండా ఉంటే దేవునికి కోటి వందనములు చెప్పండి. దానికి మించి ఈ ఉపద్రవం మార్గంలో నడవవలసి వచ్చిన ప్రభువును మాత్రమే పట్టుకోండి. యోబు వలె ఆయన నన్ను చంపిన ఆయన మీద నమ్మకంతో ఉంటాను అని దైర్యంగా ప్రభువు వైపు చూడండి. బయపడవద్దు, సాతాను భయమును తీసుకొని వస్తాడు కాని మీరు దైర్యంగా ఉండండి. యెహోవా హస్తం కరోనా కంటే శక్తివంతమైనది. అగ్నిని, నీటిని అధిగమించి దేవుడు తానే మనకు బలాన్ని ఇచ్చి మనలను విడిపిస్తారు. ఆమెన్.

- సెలెక్టెడ్

 

ప్రార్థన అంశం:-

2000/- రూపాయలు ఇచ్చి ఒక గ్రామాన్ని దత్తతు తీసుకొనే లక్ష కుటుంబాలను దేవుడు లేపేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet