Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.06.2021
Share:

By Village Missionary Movement

Thursday, 17-Jun-2021

దిన ధ్యానము(Telugu) 17.06.2021

 

వ్యర్థమైన ప్రేస్టేజ్.

 

"మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి(లేక-కీడునుండి) పుట్టునది" - మత్తయి 5:37

 

ఆంధ్రా రాష్ట్రంలో అద్భుతంగా పరిచర్య చేసిన సహోదరుడు ఎసన్న గారు ఆయన పరిచర్య జీవితంలో జరిగిన సంఘటనను ఇలాగు పంచుకుంటున్నారు. నాకు అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. రాత్రి భోజనం తరువాత ఒక అరటి పండు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తాను. ఒక మారు ఒక పట్టణమునకు ప్రసంగించుటకు వెళ్ళి యున్నను. కూడిక ముగిసిన వెంటనే బోజనముతో నాకు అరటి పండ్లు ఇష్టమని ఎలాగో తెలుసుకొని ఒక కుటుంబం నా కొరకు అరటి పండ్లు తెచ్చియున్నారు. వాళ్ళు నన్ను తక్కువగా అనుకోకూడదు, తప్పుగా అర్ధం చేసుకోకూడదు అని నాకు వద్దు అని చెప్పేసాను. నోరు చెప్పిందే తప్ప మనసు మాత్రం కావాలి అని కోరుకుంది. ఆ కుటుంబం వాళ్ళు అయ్యగారికి అరటి పండ్లు ఇష్టం ఉండదేమో అని బలవంతం చెయ్యకుండా వెళ్లిపోయారు. అరటి పండ్లు పోయాయి అని బాధ నాకు. దేనికి పనికిరాని వ్యర్థమైన ప్రేస్టేజ్ కొరకు నేను అరటి పండ్లు కోల్పోయాను. జీవితంలో ఈ విధంగా వ్యర్థమైన ప్రేస్టేజ్ కోసం దేవుడు ఇచ్చే దీవెనలు కోల్పోకూడదు అని తరువాత రోజు ప్రసంగంలో ప్రసంగించారు.

 

బైబిల్లో 2వ రాజుల గ్రంధంలో 5వ అధ్యాయంలో నైమాను గురించి చదువుతున్నాం. నైమాను ఎక్కువ దూరం నిరీక్షణతో ప్రయాణం చేసి యేలీషా వాకిట ఎదుట నిలబడ్డాడు. వెళ్ళి యొర్దానులో ఏడు మార్లు మునగమని యేలీషా యొక్క పనివాడు చెప్పిన దానిని బట్టి నైమానుకు చాలా కోపం వచ్చింది అని వ్రాయబడింది. అయినప్పటికీ తాను ఆ పని వాడు చెప్పిన మాట చొప్పున యొర్దానులో 7 మార్లు మునగగా తన శరీరం పసిపిల్ల వాని దేహం వలె మారిపోయింది అని చదువుతున్నాం.

 

దీనిని చదువుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి! మనము కూడా అనేక కార్యములలో ముప్పావు సగం కార్యములు చేసి మనస్సులో వ్యర్థమైన ప్రేస్టేజ్ పెట్టుకొని దేవుని ఆశీర్వాదములను కొలిపోతున్నాం. దేవుని సహయం పొందుకొనుటకు వాకిట వరకు వచ్చాం ఇంకా ఎందుకు వ్యర్థమైన ప్రేస్టేజ్. దానిని పక్కన పెట్టి 'నేను' అనే గర్వాన్ని విడిచిపెడదాం. దీవెనలను పొందుకుందాం. ఇతరులకు దీవెనకరముగా మారుదాం.

- సెలెక్టెడ్

 

ప్రార్థన అంశం:-

సాతాను చేత పట్టబడిన వారి కోసం , రోగము చేత పీడింపబడుతున్న వాళ్ళ కోసం హీలింగ్ సర్వీస్ నడిపించబడటానికి దాని ద్వారా వాళ్ళు విడిపించబడేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet