Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.03.2026 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 08-Mar-2026

దిన ధ్యానము(Telugu) 08.03.2026 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం

 

అంశం: డానీ స్కూల్ బ్యాగ్ ఎక్కడ?

 

"...మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును." - గలతీయులకు 6:7

 

డానీ నివసించే గ్రామం పచ్చని పొలాలు, అందమైన సెలయేర్లతో చాలా బాగుంటుంది. కానీ డానీ మాత్రం చాలా అల్లరివాడు, ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవాడు. ఇతరులను మోసం చేయడం, వారిని చూసి ఎగతాళి చేయడం అతనికి చాలా ఇష్టం. ప్రతిరోజూ స్కూలుకు వెళ్లడానికి ఇంటి నుండి త్వరగానే బయలుదేరతాడు. ఒకవేళ ఆలస్యమైతే, తన తల్లిని చాలా దారుణంగా తిడతాడు. అతని కోపానికి భయపడి వాళ్ళ అమ్మ త్వరత్వరగా వంట చేసి పెడుతుంది. బయట అల్లరి చేసినా, ఇంట్లో మాత్రం చాలా పద్ధతిగా నటిస్తుంటాడు. అది చూసి వాళ్ళ అమ్మ "నా కొడుకు ఎంత బుద్ధిమంతుడో" అని మురిసిపోయేది. కానీ అసలు విషయం ఏమిటంటే, ఇంటి నుండి త్వరగా బయలుదేరిన డానీ, దారిలో స్నేహితుల ఇళ్ల వద్ద కబుర్లు చెబుతూ స్కూలుకు ఆలస్యంగా వెళ్లేవాడు. అక్కడ కూడా చదువుకోకుండా స్నేహితులతో కబుర్లు చెప్పేవాడు. టీచర్లు ఎన్నిసార్లు మందలించినా అతను పట్టించుకోలేదు.

 

ఒకరోజు డానీ క్లాస్ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్లి, అతని ప్రవర్తన గురించి వాళ్ళ అమ్మకు చెప్పారు. కానీ వాళ్ళ అమ్మ టీచర్ మాటలు నమ్మలేదు. "నా కొడుకు చాలా మంచివాడు" అని చెప్పి టీచర్‌ను పంపించేసింది. తన తల్లి టీచర్ మాటలు నమ్మనందుకు డానీ చాలా సంతోషించాడు. మరుసటి రోజు కూడా యథావిధిగా స్కూలుకు వెళ్తూ దారిలో ఆలస్యం చేశాడు. స్కూలు అయిపోయిన తర్వాత స్నేహితులతో కలిసి ఊరి దగ్గర ఉన్న నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్ళాడు. అందరూ ఆడుకుంటుండగా, డానీ మెల్లగా వెళ్లి చెట్టు కింద ఉన్న తన స్నేహితుడి బ్యాగును తీసి ఎవరికీ తెలియకుండా దాచేశాడు. ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి వారితో కలిసి ఆడుకున్నాడు. ఆట ముగిశాక అందరూ తమ బ్యాగులు తీసుకున్నారు. ఒక అబ్బాయి బ్యాగ్ కనిపించకపోయేసరికి ఆ పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి డానీ మనసులో నవ్వుకుంటూ, తన బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు.

 

కానీ అక్కడ డానీ బ్యాగ్ కూడా కనిపించలేదు! కంగారుగా అటు ఇటు వెతికాడు. గాలిలో తన పుస్తకపు పేజీలు ఎగరడం చూశాడు. ఒక్కసారిగా చెట్టు పైకి చూడగానే డానీకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఒక కోతి డానీ బ్యాగును చెట్టు పైకి తీసుకెళ్లి, దానిని చింపి ముక్కలు చేస్తోంది. అప్పుడు డానీకి బుద్ధి వచ్చింది. "మనం ఇతరులను మోసం చేయాలనుకున్నాం, కానీ మనమే మోసపోయాం" అని గ్రహించాడు.

 

ప్రియమైన పిల్లలారా, చూశారా! డానీ ఇతరులను మోసం చేయాలనుకున్నాడు, కానీ చివరికి తనే నష్టపోయాడు. ఇతరులను మోసం చేస్తూ మనం ఎప్పటికీ సుఖంగా జీవించలేము.

- శ్రీమతి సారా సుభాష్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet