Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 26.02.2026
Share:

By Village Missionary Movement

Thursday, 26-Feb-2026

దిన ధ్యానము(Telugu) 26.02.2026

 

అంశం: క్షణాన్ని కోల్పోవద్దు

 

“యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని” - ఆదికాండము 28:16

 

25 సంవత్సరాల క్రితం నేను ఒక గ్రామంలో నివసించేవాడిని. అది చాలా అభివృద్ధి చెందిన గ్రామం. జనసంఖ్య ఎక్కువగానే ఉండేది. కానీ అక్కడి ప్రజలకు ఎక్కువ విద్య లేదు. ఆ గ్రామంలోని పిల్లలకు ట్యూషన్ చెప్పాలని దేవుడు నా హృదయంతో మాటలాడాడు. కానీ నేను ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేసాను. తరువాత పరిచర్యలోకి వచ్చినప్పుడు, ట్యూషన్ ద్వారా ఎంతోమంది పిల్లలు దేవుని తెలిసికొంటున్నారని నా కళ్లతో చూశాను. అప్పుడు మంచి అవకాశాన్ని కోల్పోయానని నాకు ఎంతో బాధ కలిగింది. అవును, మనకు వచ్చే అవకాశాలు, ప్రత్యేక హక్కులను ఎప్పుడూ కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.

 

బైబిల్లో యాకోబు అనే భక్తునికి కూడా ఇదే అనుభవం కలిగింది. అతడు అబ్రాహాము మనుమడని, దేవుడు అబ్రాహాముకు గొప్ప వాగ్దానాలు ఇచ్చినట్టు మరచిపోయాడు. జీవితంలో వచ్చిన సమస్యల కారణంగా అతడు హారణుకు ప్రయాణమయ్యాడు. సూర్యుడు అస్తమించినందున ఒక రాయిని దిండు చేసుకుని అక్కడ నిద్రపోయాడు. అక్కడ అతనికి కలలో ప్రభువు ప్రత్యక్షమై, “నీ వల్లను నీ సంతానమువల్లను భూమి యందలి సమస్త కుటుంబములు ఆశీర్వదింపబడుదురు” (ఆది. 12:3) అని చెప్పాడు. ఎక్కడికి వెళ్లినా నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేసాడు. ఉదయాన్నే లేచిన యాకోబు, “నిజముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. యిర్మియా 23:24 లో ప్రభువు, “నేనే ఆకాశమును భూమిని నింపి యున్న వాడనుకాదా?” అని అంటాడు. మనమూ సాధారణ స్థలాలలో దేవుని సన్నిధిని అనుభవించగలం. ఆయన సన్నిధిని వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు, గతపు దుఃఖాలు చిన్నవిగా అనిపిస్తాయి.

 

ప్రియ స్నేహితులారా, మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మన కళ్ళు, చెవులు తెరిచి ఉన్నాయా? 50,000 గ్రామాలలో ఒక కోటి ఆత్మలకు సువార్తను తెలియజేయాలని దేవుడు మనకు దర్శనం ఇచ్చాడు. యేసుక్రీస్తు సువార్తను ఈ లోకానికి వరంగా అందించినప్పుడు, భూమి మీద సమస్త కుటుంబాలు మన ద్వారా ఆశీర్వదింపబడతాయి. మనము దేవుని సన్నిధిని అనుభవించినవారమై ఉన్నందున, ఆయన చిత్తం నెరవేర్చుటకు మనలను సమర్పించుకుందామా? ఆమేన్.

- శ్రీమతి. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:

 కన్మణి పిల్లల ప్రార్థనా ఉద్యమం”లో చేరిన పిల్లలు యేసు కొరకు ధైర్యంగా లేచి నిలబడాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al