Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.02.2026
Share:

By Village Missionary Movement

Wednesday, 25-Feb-2026

దిన ధ్యానము(Telugu) 25.02.2026

 

అంశం: అద్భుతముగా నిర్మింపబడినవారము

 

"నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి" - కీర్తనలు 139:14

 

ఒక రైతు భూమిని దున్ని, నేలను సిద్ధం చేసి, విత్తనాలు చల్లి, నీరు పోసి, తరువాత పంట కోసం ఎదురుచూస్తాడు. నేలలో అంతర్గతంగా అద్భుతమైన కార్యం జరుగుతుంది. చిన్న విత్తనం మొక్కగా పెరిగి, తరువాత పెద్ద చెట్టుగా మారి, పువ్వులు పూసి, చివరికి ఫలములు ఇస్తుంది. ఇవన్నీ ప్రభువు అద్భుత కార్యములు. వృద్ధి కలుగజేయువాడు దేవుడే.

 

పచ్చి గడ్డి తినే ఆవు, మనుషులకు పోషకాహారముతో నిండిన తెల్లని పాలను ఇస్తుంది. ఇది ప్రభువు అద్భుత కార్యమని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రభువు కార్యములు అద్భుతములు. మన హృదయం ఎప్పుడైనా “కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను” అని ఆగిపోయిందా? అలా ఆగితే మనం బ్రతుకగలమా? మన ప్రభువు కార్యములు ఎంత అద్భుతమో! ప్రతి నిమిషం మన హృదయాన్ని నడిపించి కాపాడుతున్న తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలి.

 

మనము వాహనాలను ఉపయోగిస్తాము. ఎంత ఖరీదైన వాహనం అయినా కొన్ని గంటలకే ఆపి ఇంధనం నింపి విశ్రాంతి ఇవ్వాలి. కానీ చూడండి, దేవుడు మెతూషెలహు హృదయాన్ని 969 సంవత్సరాలు ఆగకుండా కొట్టుకునేలా ఉంచాడు (ఆది. 5:27). అందుకే కీర్తనకర్త “నేను అద్భుతముగా చేయబడితిని” అని అంటున్నాడు.

 

మనకు ప్రమాదం సంభవించినప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండము. క్షణంలోనే మెదడు హెచ్చరికను గ్రహిస్తుంది; కన్నులు చూస్తాయి; కాళ్లు పారిపోవడానికి సిద్ధమవుతాయి; నోరు “యేసయ్యా” అని ప్రభువును పిలుస్తుంది; చేతులు ప్రమాదాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి. మన శరీరమంతా కలిసి ఎలా పనిచేస్తుందో చూడండి! ఈ అద్భుతమైన సహజ ప్రతిస్పందనలను చేయగల జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? ప్రభువే. ఆయన మన ప్రతి అవయవాన్ని కాపాడుతున్నాడు.

 

మనకొరకు తన శరీరాన్ని సిలువపై బలియాగముగా అర్పించిన దేవునిని స్తుతిద్దాం. మన అవయవములు కలిసి పనిచేసినట్లే, విశ్వాసులముగా మరియు సేవకులముగా మనము కూడ ఐక్యముగా పనిచేసి, ప్రభువు మనకు ఇచ్చిన దర్శనమును నెరవేర్చుటకు దేవుడు కృపను ఆనుగ్రహించునుగాక. విజయము నిశ్చయమని విశ్వసిద్దాం.

- బ్రదర్ .ఐ. జయపాల్ గారు

 

ప్రార్థనా అంశం:

కన్మణి పిల్లల ప్రార్థనా ప్రాజెక్ట్‌లో యేసు కొరకు చేరిన పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet