Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.02.2026
Share:

By Village Missionary Movement

Tuesday, 24-Feb-2026

దిన ధ్యానము(Telugu) 24.02.2026

 

అంశం: ప్రభువులో బలంగా ఉండండి

 

“...దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను.” – 1 సమూయేలు 30:6

 

మన జీవితంలో వచ్చే క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దేవుని ప్రేమ, కృప లేకుండా మనము ఒక్క క్షణముకూడా జీవించలేము. ఈ లోకంలో అనేక మంది మనలను నిరుత్సాహపరచవచ్చు, కానీ మనలను ప్రోత్సహించే వారు చాలా కొద్దిమందే ఉంటారు.

 

రాజైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్న కాలంలో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. గొర్రెలను కాచుచుండగా అతని చేతిలో వీణ (హార్ప్) ఉండేది. తన సంగీత వాద్యంతో దేవునిని స్తుతిస్తూ ప్రభువుయొక్క సన్నిధిని అనుభవించేవాడు. అదే దావీదుకు అనేక కీర్తనలు రచించేందుకు సహాయపడింది. దేవునిపై నమ్మకంతో అతడు గొల్యాతును సంహరించాడు. దావీదు గొల్యాతును చంపకపోయి ఉంటే, సౌలు మరియు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు పన్ను చెల్లిస్తూ కష్టమైన జీవితం గడిపి ఉండేవారు.

 

కానీ దావీదుకు వచ్చిన గొప్ప పరీక్ష అతని మామగారైన సౌలు రాజును ఎదుర్కోవడమే. ప్రజలు దావీదును పొగిడినందుకు సౌలు అసూయతో నిండిపోయాడు. అతన్ని అనేకసార్లు చంపాలని ప్రయత్నించాడు. అంతేకాక, దావీదుతో ఉన్న ప్రజలే అతన్ని రాళ్లతో కొట్టి చంపాలని యత్నించారు. ఈ విధంగా దావీదు ఎన్నో విరోధాలను ఎదుర్కొన్నాడు.

 

మీరు సమస్యలలో ఉన్నప్పుడు దావీదును జ్ఞాపకం చేసుకోండి. అతడు తనను తాను ప్రభువులో బలపరచుకున్నాడని బైబిలు చెబుతుంది. “ఆపదకాలమందు అతడు నన్ను పిలిచెదడు; నేను అతనికి ఉత్తరమిచ్చి అతన్ని విడిపించెదను” అని ప్రభువు సెలవిస్తున్నాడు.

 

ప్రియమైన స్నేహితులారా! కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు ఎప్పుడైనా మనలను తిరస్కరించవచ్చు. అంధకారాధిపతి మనుషుల హృదయాలలో చేదుతనాన్ని నింపుతున్నాడు. భార్యాభర్తలను విడగొట్టడం, పిల్లలను తల్లిదండ్రుల నుండి దూరం చేయడం అతని కార్యం. ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు: “ఇతరుల గురించి మీ దగ్గరకు వచ్చి తరచుగా చెప్పేవారు, వారు మీ గురించి కూడా ఇతరుల దగ్గర చెబుతారని మీకు తెలుసా?”

 

జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ మీరు ప్రభువులో మిమ్మును బలపరచుకోండి. నిత్యమైన దేవుడు అద్భుతరీతిగా మిమ్మల్ని సమస్యల నుండి విడిపించి, నడిపించి, విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్.

- డా. ఎల్. జయపాలన్ గారు

 

ప్రార్థన అంశం: 

యేసు నిమిత్తము కన్మణి చిన్నారుల ప్రార్థనా కార్యక్రమంలో చేరిన పిల్లల రక్షణకొరకు ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet