Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.02.2026
Share:

By Village Missionary Movement

Monday, 23-Feb-2026

దిన ధ్యానము(Telugu) 23.02.2026

 

అంశం: యెఫ్తా –తిరస్కరించబడినవాడు

 

"అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను" - న్యాయాధిపతులు 11:11

 

రాజు ప్రతి ప్రార్థనా సమావేశానికి క్రమంగా వచ్చేవాడు. కానీ ప్రతి సారి ప్రార్థనలో ఏడ్చేవాడు. ఇది గమనించిన పాస్టర్ అడిగాడు: “నువ్వెందుకు ఎప్పుడూ ఏడుస్తున్నావు?” రాజు సమాధానమిచ్చాడు: “నేను నమ్మిన స్నేహితులు నన్ను మోసం చేసి వదిలి వెళ్లిపోయారు. అది నేను భరించలేకపోతున్నాను.” అప్పుడు పాస్టర్ చెప్పాడు: “మనము నమ్మినవారు మనలను వదిలి వెళ్తే మన హృదయం విరిగిపోతుంది. కానీ మనలను ఎప్పుడూ విడిచిపెట్టని ప్రభువును ఆశ్రయించి ప్రార్థించినప్పుడు, ఆయన మన విరిగిన హృదయాన్ని స్వస్థపరచి, మనకు శాంతిని అనుగ్రహిస్తాడు.”

 

బైబిల్లో యెఫ్తా కూడా తన కుటుంబం చేత తిరస్కరించబడినవాడే. అతను చట్టబద్ధమైన భార్యకు పుట్టినవాడు కాకపోవడంతో అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అతని తండ్రి భార్య కుమారులు అతనిని ద్వేషించి, “నీవు మా తండ్రి ఇంటిలో భాగం పొందవు” అని చెప్పి బయటకు పంపివేశారు. అప్పుడు యెఫ్తా వెళ్లి శూరుడిగా మారాడు. యెఫ్తా జీవితంలో ఒక మంచి విషయం ఏమిటంటే, అతను దేవుని సన్నిధిని ఆశ్రయించి, తన సంగతులన్నిటిని మిజ్పాలో యెహోవా ముందు చెప్పాడు.

 

తరువాత అతని సహోదరులందరూ అతనిని వెతుక్కొని వచ్చారు. కారణం ఏమిటి? యుద్ధం ప్రారంభమైంది. అతనిని తరిమివేసినవారే ఇప్పుడు “నీవే మా నాయకుడవై మా సైన్యానికి అధిపతిగా ఉండాలి” అని కోరారు. ప్రభువు యెఫ్తాను ఎందుకు తిరస్కరణకు అనుమతించాడు? ఇదే కారణం కోసం. అతను తిరస్కరించబడకపోతే, అతని విజయము అంత గొప్పగా కనిపించేది కాదు. అతను వెళ్లగొట్టబడినందువల్లే పెద్దలు అతనిని వెతుక్కొని వచ్చి తిరిగి ఆహ్వానించారు. యెఫ్తా వారితో కలిసి యుద్ధానికి వెళ్లాడు. అతను ప్రభువుపై ఆధారపడి నందువల్ల దేవుడు అతనితో నుండీ అతనికి విజయాన్ని ఇచ్చాడు. యెహోవా ఆత్మ యెఫ్తాపై దిగివచ్చింది.

 

ఈ రోజు మనము కూడా వివిధ రకాల అవమానాలు లేదా తిరస్కరణలను మోస్తూ ఉండవచ్చు. బయటకు సంతోషంగా కనిపించినా, మన హృదయంలో బాధతో ఏడుస్తూ ఉండవచ్చు. మన అవమానాన్ని మార్చుటకు, మన గాయాలను స్వస్థపరచుటకు మనలను నీడవలె అనుసరించే ప్రభువు ఉన్నాడు. మనము అనాథలము కాదు, విడిచిపెట్టబడినవారము కాదు. యెఫ్తా వలె మన సంగతులన్నిటిని మనుష్యులకు కాకుండా ప్రభువుకే చెప్పినప్పుడు, ఆయన మనం చేరని ఎత్తులకు, మనం ఊహించని స్థాయులకు తీసుకువెళ్తాడు. మనలను ఇతరులకు ఆశీర్వాదముగా నిలుపుతాడు.

- శ్రీమతి. లలిత గారు

 

ప్రార్థనా అంశం: 

తమిళనాడులో సేవకుల పిల్లలు “Arise Joshua & Esther” ప్రాజెక్టులో చేరేలా ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al