Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.06.2021
Share:

By Village Missionary Movement

Tuesday, 15-Jun-2021

దిన ధ్యానము(Telugu) 15.06.2021

ఇయ్యుడి:-

"ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును" - లూకా 6:38

ఆనీ ఆశ్విత్ అనే ఉపాధ్యాయుడు 1887 సంవత్సరం తిరుణల వేళి అనే జిల్లాలో ఒక కళాశాలలో పాఠాలు చెబుతూ ఉన్నప్పుడు బిక్ష మడుగుటకు ఒక బాబు వచ్చాడు అందుడైన ఆ బాలుడు ఆయన యొద్దకు వచ్చి బిక్ష మడిగాడు తమ్ముడు ఇది విద్య నేర్పిస్తున్న స్థలము నీకు ఇచ్చుటకు ఆహారము లేదు కాబట్టి నీవు వేరే చోటికి వెళ్ళి అక్కడ బిక్ష మడుగుము అని అన్నారు. వెంటనే ఆ బాలుడు జవాబుగా నాకు విద్యనివ్వండి అని అన్నాడు. ఆ మాట ఆయన యొక్క హృదయంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. ఆ మాట యొక్క ప్రభావం వలనే అందులకు పాఠాలు చెప్పుటకు ఒక  స్కూల్ ప్రారంభించాలని ఆలోచన కలిగింది వెంటనే ఆ బాలుడికి పాఠాలు చెప్పడం పారంభించారు. వెంటనే అది ఒక స్కూలు గా పెరిగింది. భవిష్యత్ లో అది చాలా పెద్ద స్కూల్ గా రూపాంతరం చెందింది. 

పరిశుద్ధ గ్రంధం అయిన బైబిల్ ల్లో కూడా సారేప త్ అనే ఊరిలో ఉండిన విధవరాలు తన యొద్ద ఉండిన కొంచము పిండి నూనె మాత్రమే పెట్టుకొని ఉన్నది ఈ పరిస్థితులలో ఏలీయా అనే ప్రవక్త వచ్చి తన యొద్ద ఉన్న కొంచము పిండి కొంచెము నూనె తో రొట్టె ని తయారు చేసి ఇమ్మని అడుగుతున్నాడు. ఆమె అలాగే చేసింది. అందునిమిత్తము ఆ దేశంలో వర్షము కురవక కుండ కరువు వచ్చినప్పటికి ఆ విధవరాలు యొక్క కుండలో పిండి తగ్గిపోలేదు, బుడ్డీ లో నూనె కొదువై పోలేదు. తనకు కలిగిన కష్ట పరిస్థితి లో కూడా తనకు కలిగిన వాటిలో నుండి పెట్టడం వలన కరువు కాలమంతటిలో కూడా తను దీవెన కరముగా, సమృద్ధిగా జీవించుటకు హేతువైంది.

దీన్ని చదువుతున్న ప్రియమైన వారలారా!  యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటవలన మనము ఆయనను ప్రేమిస్తున్నాం. విధవరాలు కూడా తనకు కలిగినవన్నీ ఇచ్చి దీవెన కరమైన జీవితాన్ని పొందుకుంది. ఆనీ కూడా తన యొద్ద ఉన్న విద్యను ఇచ్చుట వలన గొప్ప అంధుల బడి ఏర్పడటానికి కారకులయ్యారు. మనం కూడా ఈ కరోనా లాక్ డౌన్ లో ఉంటున్నప్పుడు మన ఇంటి పక్కనే ఉంటున్న అనేకులు తమ పనులు కోల్పోయి ఒకపూట భోజనం కూడా లేకుండా ఉండవచ్చు. అలాంటి వాళ్ళకు, పేదలకు, సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్నవారికి మనము చేయగలిగిన సహాయం చేద్దామా, ఇతరులకు మన హస్తాన్ని చాపుదమా విస్తారముగా దేవుడు కూడా మనలను ఖచ్చితంగా దీవిస్తారు. 
-    శ్రీమతి. జీవా విజయ్.

ప్రార్థన అంశం:-
మనము దర్శిస్తున్న గ్రామాలలో చిన్న పిల్లలు, యవ్వనస్తులు ప్రభునందు నిలచి ఉండేటట్లు ప్రార్థిద్దాం. 

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al