Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.06.2021
Share:

By Village Missionary Movement

Friday, 11-Jun-2021

దిన ధ్యానము(Telugu) 11.06.2021

 

సోలిపోకుము.

 

“క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు” - 2తిమోతికి 3:12

 

భక్తిగల కుటుంబము, ఎలాంటి లోటులేని జీవితం. హఠాత్తుగా వచ్చిన తుఫాను వలె భర్త అనారోగ్యం వలన మరణించారు. ఆయన ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్దించిన ప్రార్థనలు వ్యర్థం అయ్యాయి, దేవుడు ప్రార్థన అలకించలేదు అని భార్య ప్రార్థన చెయ్యడం మానేసింది. కాని మరల దేవునికి ప్రార్థన చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. దేవుడు లేకుండా ఎలాగు ఈ లోకంలో జీవించ గలము అని గ్రహించి ప్రభువును ప్రార్ధించడం ప్రారంభించింది. ప్రభువు మరల ఆమెకు నిరక్షణను ఇచ్చి బలపరిచారు. 

 

ఈ దినములో కూడా ఎక్కడా చూసిన కూడా మరణములు, రోగములు, పని లేక ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా ఎంత కాలం ఉంటుంది, దేవుడు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది మారదా ఎందుకు నా కుటుంబంలో ఇన్ని కష్టాలు అని విలపిస్తున్నవాళ్ళు అనేకులు. మన అందరి ప్రశ్నలకు జవాబు యేసుక్రీస్తే. ఆయన సిలువలో వేయబడినప్పడు ఆయన విడవబడిన వాడిగా నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అని ఆయన మన వలె అంగలార్చుతున్నారు. కాబట్టి ఆయనకు మన బాధలు అన్ని కూడా బాగుగా తెలుసును. కాబట్టి మన బాధలలో తప్పకుండా సహాయం చేస్తారు. ఆయన మరణాన్ని జయించారు మనల్ని కూడా జయింప చేస్తారు. సాతాను యొక్క తలను సిలువలో నలగ గొట్టారు. కనుక మనలను కూడా విజయం పొందేటట్లు చేస్తారు. కాబట్టి ఇలాంటి కఠినమైన కాలంలో కూడా సమస్యలను చూసి నిరుత్సాహము పొందకుండా నిరీక్షణను ఇవ్వమని ప్రార్థిద్దాం. ఈ శ్రమలు నిరంతరం ఉండేవి కావు, ఇవి గతించి పోవును. హల్లెలుయా!

- శ్రీమతి. జ్యోతి ఆనంద్

 

ప్రార్థన అంశం:-

విలేజ్ మిషనరీ మూవ్ మెంట్ లో గల సేవకుల యొక్క ప్రతి అవరములు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి

వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 

ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 

హిందీ కొరకు +91 93858 10496

తెలుగు +91 94424 93250

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al