By Village Missionary Movement
Friday, 01-Aug-2025దిన ధ్యానము(Telugu) 01.08.2025
అంశం: రాజకీయ నాయకుడు
“తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియులేదు” - యోహాను 7:18
ఇశ్రాయేలీయులు కనాను వైపు ప్రయాణిస్తూ మోయాబులో విడిది చేసినప్పుడు, బాలాకు రాజు భయపడ్డాడు. ప్రభువు వారి కోసం ఇంతవరకు చేసిన ప్రతిదాని గురించి అతను విన్నాడు. వారి విజయానికి భయపడి, అతను ఒక ప్రవక్త ద్వారా వారిని శపించడానికి ప్రయత్నించాడు. కాబట్టి అతను ప్రవక్త అయిన బిలామును పిలవడానికి తన అధికారులను పంపాడు. ప్రభువు అనుమతిస్తేనే వస్తానని బిలాము చెప్పాడు, దేవుడు నిరాకరించడంతో, అతను అభ్యర్థనను తిరస్కరించాడు. తర్వాత, బాలాకు మరింత విశిష్ట అధికారులను పంపాడు. బిలాము, “బాలాకు తన రాజభవనాన్ని వెండి బంగారాలతో నాకు ఇచ్చినా, నా దేవుడైన యెహోవా ఆజ్ఞను నేను అధిగమించలేను” అని జవాబిచ్చాడు. అయినప్పటికీ, అతని హృదయంలో, అతను వెళ్ళాలని కోరుకున్నాడు. “ఈ ప్రజలు ఆశీర్వదించబడ్డారు, వారిని శపించవద్దు” అని దేవుడు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా, బిలాము తన స్వంత కోరికల వల్ల మళ్లీ దేవుణ్ణి అడగాలనుకున్నాడు. దేవుడు అతని హృదయాన్ని చూసి, "వెళ్ళు, కానీ నేను చెప్పేది మాత్రమే మాట్లాడు" అన్నాడు. బిలాము మరుసటి రోజు ఉదయాన్నే లేచి వెళ్లి ప్రభువు కోపాన్ని రగిల్చాడు (సంఖ్యాకాండము 22:22)
అవును, నేడు చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. వారి నోళ్లు ప్రభువు మాటను పలుకుతాయి మరియు ఆయనను స్తుతిస్తాయి. కానీ వారి ఆలోచనలు మరియు చర్యలు ఆయనకు కోపం తెప్పిస్తాయి. దేవుడు ఇలా అంటున్నాడు, “ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి వచ్చి, పెదవులతో నన్ను స్తుతిస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి” (యెషయా 29:13). క్రీస్తు ప్రేమను అనుభవించి, ఆయన వాక్యాన్ని విన్న చాలామంది ఇప్పటికీ దానికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, వారు మాట్లాడేటప్పుడు, ప్రజల నుండి మద్దతు మరియు లాభం పొందడం కోసం పొగిడే పదాలు ఉపయోగిస్తారు. అదే విధంగా, క్రైస్తవులు తరచుగా మాట ఒకటి మరియు పని ఇంకొకటి అనేలా జీవిస్తున్నారు.
ప్రియతమా, పునరుజ్జీవనం గురించి మాట్లాడటం మరియు రాజకీయ నాయకులలా జీవించడం పనికిరానిది. క్రీస్తు ప్రేమను రుచి చూసే ప్రతి ఒక్కరూ, ఆయన వాక్యాన్ని చదివి వినిపించే ప్రతి ఒక్కరూ దాని ప్రకారం జీవిస్తే, పునరుజ్జీవనం వస్తుంది. ప్రపంచం మాటవైపు చూడదు, మన జీవితాలవైపు చూస్తుంది. ప్రేమను చూపించాల్సిన చర్చిలు కూడా కొన్నిసార్లు కలహాలు మరియు గందరగోళాన్ని చూపుతాయి. అందుకే యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, "వాక్యమును మాత్రమే వినేవారిగా ఉండకుడి, వాక్యము ననుసరించువారిగా ఉండండి, మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుదురు" (యాకోబు 1:22). ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవిద్దాం. ప్రభువు చెప్పిన దీవెనలను వారసత్వంగా పొందుదాం.
- కె. డేవిడ్ గణేశన్ గారు
ప్రార్థన అంశం:
మా సేవకులు మరియు తోటి సేవకులు ఏర్పాటు చేసిన వ్యాన్లు మరియు బస్సులు అవసరాలు తీర్చబడాలని ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250