By Village Missionary Movement
Thursday, 26-Jun-2025దిన ధ్యానము(Telugu) 26.06.2025
అంశం: ఒక ఆత్మ యొక్క వెల
"జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు" - సామెతలు 11:30
అలెగ్జాండర్ ది గ్రేట్, తన మరణశయ్యపై, మూడు చివరి కోరికలు చెప్పాడు. మొదట, అతని శవపేటికను ఉత్తమ వైద్యులు తీసుకువెళ్లాలి. రెండవది, తన అంత్యక్రియల ఊరేగింపు మార్గంలో తన బంగారం మరియు సంపద చెల్లాచెదురుగా ఉండాలని కోరాడు. మూడవది, అతను తన చేతులను తన శవపేటిక వెలుపల వేలాడదీయమని, తెరిచి మరియు ఖాళీగా ఉంచమని ఆదేశించాడు. కమాండర్ దానిని వివరించమని అడిగాడు. అలెగ్జాండర్ ఇలా సమాధానమిచ్చాడు: "నా మరణాన్ని ఉత్తమ వైద్యులు కూడా నిరోధించలేరు, నేను సంపాదించిన సంపద అంతా ఈ లోకంలో మిగిలిపోయింది, నేను ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చాను, మరియు నేను అదే దారిలో బయలుదేరాను, ఈ సత్యాన్ని ప్రపంచం చూడనియండి అని వివరించాడు . భూమిపై గొప్పగా భావించేది, మనం చనిపోయినా తిరిగి రాదని ప్రపంచానికి తెలియజేయడానికి అతను ఇలా చెప్పాడు. అటువంటి సంఘటన గురించి ఈ రోజు మనం చదువుతున్నాము.
ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పంటను పండించింది. అతను తనలో తాను ఇలా అనుకున్నాడు: "నేను నా ధాన్యం మొత్తం నిల్వ చేయడానికి నా గిడ్డంగులు పడగొట్టి, పెద్ద వాటిని నిర్మిస్తాను. అప్పుడు నేను నా ప్రాణముతో ఇలా చెప్పుకుంటాను, 'ప్రాణమా చాలా సంవత్సరాలకు సరిపడ సమాకూర్చను. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము.
ప్రియమైన వారలారా, పరలోకంలో ధనాన్ని భద్రపరచమని ప్రభువు మనలను ప్రోత్సహిస్తున్నాడు. దానికి ఒక మార్గం రాజ్యం కోసం ఆత్మలను గెలుచుకోవడం. పాప క్షమాపణ లేదా నిత్యజీవాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేరు. కానీ యేసు ఇప్పటికే తన విలువైన రక్తం ద్వారా మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మనం సంపాదించిన ఆత్మలు మరియు మనం చేసిన మంచి పనులు తప్ప మరేమీ మన వెంటరావు.
మన ఆశ మరియు లక్ష్యం ఈ ప్రపంచంలోని నశించే వాటిపై మాత్రమే ఉంటే, మన పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అందుచేత మనం జ్ఞానవంతులమై ఆత్మలను గెలుచుకుందాం. ఇతరులను మోక్ష మార్గంలో నడిపించాలని నిశ్చయించుకుందాం. సమయం అనుకూలమైనా, అననుకూలమైనా శ్రద్ధతో సువార్తను ప్రకటిద్దాం. ప్రభువు మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు.
- సిస్టర్. ఎస్తేర్ సెల్వి గారు
ప్రార్థన అంశం:
యవ్వనస్తుల ఉపవాస శిబిరంలో అభిషేకం పొందిన యువకులు ప్రతిరోజూ అదే అభిషేకాన్ని కొనసాగించాలని ప్రార్థిస్తారు.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250