Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.04.2025
Share:

By Village Missionary Movement

Tuesday, 22-Apr-2025

దిన ధ్యానము(Telugu) 22.04.2025

 

అంశం:-వేచియున్న దేవుడు

 

"కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయముతీర్చు దేవుడుఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు" - యెషయా 30:18

 

నిరీక్షించడం కష్టమైన అనుభవం. దేవునికి యొద్ద ఆశీర్వదించబడటానికి వేచి ఉండటం చాలా అవసరం. మొగ్గ వికసించి పండు ఫలించాలంటే నిరీక్షణ తప్పనిసరి. దేవుని వాగ్దానాలు మనలో నెరవేరాలంటే ప్రభువు సమయం కోసం ఎదురుచూడడం చాలా అవసరం

 

బైబిల్లో, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహము మనకు తెలుసు. ప్రభువు అబ్రాహామును పిలిచినప్పుడు, అతనికి 75 సంవత్సరాలు. అప్పుడు ప్రభువు అబ్రాహాముతో ఇలా అన్నాడు, "నీ ద్వారా భూమి యొక్క అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయి" (ఆదికాండము 12:3,4). అబ్రాహాము కూడా ప్రభువు మాటకు కట్టుబడి, వాగ్దాన కుమారుడైన ఇస్సాకును పొందే ముందు 25 సంవత్సరాలు వేచి ఉన్నాడు. (ఆదికాండము 21:5). అబ్రాహాము కూడా వేచియున్నాడని ఇక్కడ మనం చూస్తాము. అబ్రాహామును పిలిచిన ప్రభువు కూడా వాగ్దానాన్ని నెరవేర్చడానికి వేచి ఉన్నాడు. దేవుని వాక్యం కోసం ఎదురుచూస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ప్రభువు తనను అవమానపరచడని అతనికి ఖచ్చితంగా తెలుసు. అవును, విశ్వాసంతో ఎదురుచూసిన అబ్రాహాము విశ్వాసానికి తండ్రి అయ్యాడు.

 

ప్రియమైన వారలారా! మనం ఎదురు చూస్తున్నప్పుడు, ప్రభువు మనల్ని పరీక్షించి, ఆయన మనకు ఇచ్చే ఆశీర్వాదాలకు తగిన పాత్రలుగా చేస్తాడు. అయితే ప్రభువు కోసం ఎదురుచూసేవాళ్లు కొత్త బలాన్ని పొందుతారు; వారు పక్షిి రాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారు; వారు పరుగెత్తి అలసిపోరు. (యెషయా 40:31) అవును, ప్రభువు కోసం ఎదురుచూసేవాళ్లు కొత్త బలాన్ని పొందుతారు. ఎదురుచూసిన అబ్రాహామును ప్రభువు అవమానపరచలేదు. ఆయన మనలను కూడా అవమానపరచడు. ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మకమైనవాడు. మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఆలస్యం జరగవచ్చు, కానీ కార్యం నెరవేరడం కచ్చితం. వేచి ఉన్నప్పుడు, అనేక ప్రశ్నలు ఖచ్చితంగా తలెత్తవచ్చు. కానీ ఖచ్చితంగా సమాధానం ఉంది.

- బ్రదర్. కుమార్ గారు

 

ప్రార్థన అంశం: 

ఉత్తర రాష్ట్రాల్లోని మిషనరీల భద్రత కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet