Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.04.2025
Share:

By Village Missionary Movement

Monday, 14-Apr-2025

దిన ధ్యానము(Telugu) 14.04.2025

 

అంశం:- నమ్మకమైన ప్రార్థన

 

"విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును" - యాకోబు 5:15

 

అమెరికాలో మార్క్ అనే డాక్టర్ ఉండేవాడు. ఓ సెమినార్‌లో మాట్లాడేందుకు మరో చోటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు భారీ వర్షం పడడంతో విమానాలను రద్దు చేశారు. కానీ అతను ఎలాగైనా వెళ్ళవలసి వచ్చింది. అద్దె కారు తీసుకుని వెళ్లిపోయాడు. కానీ వర్షం కారణంగా వాహనం ఒక ఊరు దాటి ముందుకు వెళ్లలేకపోయింది. అందుకు వాహన చోదకుడు "అయ్యా! మనం ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరం. ఇక్కడే ఎక్కడైనా ఉండగలమో చూద్దాం" అన్నాడు. వాహనాన్ని ఆపాడు.

 

దూరంగా ఒక వెలుగు కనిపించింది. డాక్టర్ వాహనం దిగి ఇంటి తలుపు తట్టాడు. ఒక తల్లి వచ్చి తలుపు తీసి అతన్ని లోపలికి ఆహ్వానించి స్వాగతం పలికింది. తర్వాత హాల్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఒక చిన్న గదిలోకి వెళ్లి ప్రార్థన చేయడం మొదలుు పెట్టింది . డాక్టర్ గదిలోకి చూశాడు. అక్కడ ఓ యువకుడు మంచంపై చాలా అధ్వాన్నంగా పడి ఉన్నాడు. తల్లి అతని దగ్గర ప్రార్ధన చేస్తోంది. ఆమె బయటకు రాగానే డాక్టర్ “ఆ మంచం మీద ఉన్న వ్యక్తి ఎవరు?” అని అడిగాడు. చాలా ఏళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న నా కొడుకు అని తల్లి చెప్పింది. అతనికి చికిత్స చేయలేదా? అని అడిగాడు. అమెరికాలో ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు, కానీ అతనిని అక్కడికి తీసుకెళ్లే స్థోమత నాకు లేదు. ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను.. తప్పకుండా సాయం చేస్తాడు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నది ఆ తల్లి.. డాక్టర్ చాలా ఆశ్చర్యపోయి అతనే డాక్టర్ అని చెప్పి తమ సొంత ఖర్చులతో అమెరికా తీసుకెళ్లి ఆ యువకుడికి వైద్యం చేయించారు.

 

బైబిల్లో, లూకా 13లో, యేసుక్రీస్తు సబ్బాత్ రోజున సమాజ మందిరంలో బోధిస్తున్నారు. అక్కడ 18 ఏళ్లుగా వంగి, నిటారుగా నిలబడలేని ఓ మహిళ ఉంది. యేసుక్రీస్తు ఆమెపై చేతులు వేశారు వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. 18 సంవత్సరాలుగా ఆమె చేసిన ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే, దేవుడు నియమించిన రోజున, ఆ విశ్రాంతి రోజున ఆమె స్వస్థత పొందింది.

 

అవును, ప్రభువు మన ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడు. సమాధానం ఆలస్యం కావచ్చు, కానీ సమాధానం ఇవ్వడం కచ్చితం. మనం విశ్వసించినప్పుడు, దేవుని మహిమను మనం తప్పకుండా చూస్తాము. మనం విశ్వాసంతో ప్రార్థిద్దాం మరియు మనం విజయం సాధిస్తాము.

- శ్రీమతి. షీలా జాన్ గారు

 

ప్రార్థన అంశం:

దయచేసి మా తోటి సేవకుల శ్రేయస్సు కోసం మరియు వారు చేస్తున్న పరిచర్య కోసం ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al