Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.01.2025
Share:

By Village Missionary Movement

Friday, 24-Jan-2025

దిన ధ్యానము(Telugu) 24.01.2025

 

అంశం: రక్షించే దేవుడు

 

"యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును" - నహూము 1:7

 

యెహోవా ఎల్లప్పుడూ మంచివాడే, మరియు మనకు మంచి చేస్తూ ఉంటాడు. పై వాక్యమునుబట్టి, దేవుడు శ్రమాకాలంలో మనకు కోటవంటి రక్షకుడని స్పష్టమవుతోంది. శ్రమలో ఉన్నప్పుడు, ఏదీ సాధ్యం కాదనిపించినప్పుడు ఆయన మనను ఎత్తి నిలబెట్టలేదు ఎందుకు? ఒక సంఘటనను చెప్పదలుచుకున్నాను.

 

రెండు దేశాల మధ్య యుద్ధం జరిగాక, ఓడిపోయిన దేశపు సైనికులను ఒక గదిలో బంధించారు. వారిలో ఒక సైనికుడు తప్పించుకున్నాడు. సైనికులు అతనిని చూసి వెంబడించారు. అతను పాడైన ఒక ఇంటి చీకటి గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. ఆ గదిలో కన్నీరు పెట్టుకుని దేవుని ప్రార్థించాడు. ఆ తర్వాత, అతడు గమనించాడు, గదికి బయట తలుపుకు ఉన్న గడియ సాలీడు గూడు అల్లి ఆ తలుపును పూర్తిగా మూసేసింది. అతని వెంబడి వచ్చిన సైనికులు ఆ గదికి వచ్చి లోపల చూడలేదు, వెనక్కి వెళ్లిపోయారు. ఎందుకో మీకు తెలుసా? సాలీడు జనసంచారం లేని ప్రదేశాల్లోనే నివాసముంటాయి. మన దేవుడు అద్భుతమైనవాడు. ఓ యోధుడి ప్రాణాన్ని చిన్న సాలీడుతో ఎలా రక్షించాడో చూడండి.

 

అలాగే బైబిల్లో, మోషే అనే దేవుని వ్యక్తి ఇశ్రాయేలీయులను ఫరో చేతుల నుండి రక్షించి తీసుకెళ్లినప్పుడు, ఫరో సైన్యం వెంబడి వచ్చింది. ఇశ్రాయేలీయులకు దారి లేదు. ముందు మహాసముద్రం, వెనుక ఫరో సైన్యం. ప్రజలు భయపడి మోషే పై కేకలు పెట్టారు. దేవుడు వారిని ఎలా రక్షించాడో మీకు తెలుసా? ప్రభువు మోషేను చూచి, "నీ కఱ్ఱను సముద్రంపై చాపుము" అని చెప్పాడు. దేవుడు బలమైన తూర్పు గాలిని రాత్రంతా పంపించి సముద్రాన్ని విభజించాడు. (నిర్గమకాండము 14:21). సముద్రం విభజించబడే ముందు, ప్రజల ముందు నడిచిన దేవదూత వెనుకకు వెళ్లి, ఇశ్రాయేలీయుల సైన్యానికి వెనుక కాపలాగా నిలిచాడు. మేఘస్తంభం ఇశ్రాయేలీయులకు వెలుగునిచ్చింది, ఫరో సైన్యానికి చీకటి చేసింది. ఇశ్రాయేలీయులు ఆ రెండుగా చీలిన సముద్రం మధ్యలో ఆరిన నేల పైన నడిచారు. ఆ తర్వాత, ఫరో సైన్యం వచ్చినప్పుడు, సముద్రం మళ్లీ మూసుకొని వారిని నాశనం చేసింది.

 

మీరు కూడా ఇప్పుడు వైద్యుడిచే నిర్లక్ష్యం చేయబడి ఉండవచ్చు, అప్పుల పాలు కావచ్చు, లేదా పిల్లలు లేని దుఃఖంలో ఉండవచ్చు. మన దేవుడు ఆ యోధుడిని చిన్న సాలీడుతో రక్షించినట్లే, మీ సమస్య ఏమిటైనా, ఆయన మీ చేతిని పట్టుకుని రక్షిస్తాడు. ప్రియులారా, మన యేసయ్య మనలను విడువడు, మరువడు. భయపడకండి.

- శ్రీమతి షీలా జాన్ గారు

 

ప్రార్ధన అంశం: 

వెల్లోరు యువజన శిబిరం కోసం అవసరాలు తీర్చబడాలని ప్రార్ధించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet