Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.01.2025
Share:

By Village Missionary Movement

Monday, 20-Jan-2025

దిన ధ్యానము(Telugu) 20.01.2025

 

అంశం: రాళ్లను తొలగించండి

 

"రాళ్లను ఏరి పారవేయుడి" - యెషయా 62:10

 

క్రిస్టీ ఒక అందమైన గులాబి మొక్కను కొనుగోలు చేసి ఒక కుండలో నాటింది. నెలలు గడిచినా, ఆ మొక్క పెరగలేదు, ఏ చిన్న ఎదుగుదల కనిపించలేదు. క్రిస్టీ కారణం అర్థం చేసుకోలేకపోయింది. ఆమె ఆ మొక్కను తన తల్లికి చూపించింది. ఆమె కుండలో చాలా రాళ్లు ఉన్నాయని గమనించింది . ఆమె రాళ్లను పూర్తిగా తీసివేసి, మంచి ఎర్ర మట్టిని నింపి, గోదుమపొడి చేర్చి మొక్కను తిరిగి నాటింది. మరుసటి నెలలో ఆ మొక్క బాగా పెరిగి అందమైన పూలతో విరబూసింది.

 

అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా చాలా రాళ్లు ఉంటాయి. అవి దేవుడు ద్వేషించే పాపాలు కావొచ్చు, లేదా ప్రభువుకు ఇష్టము లేని విషయాలు కావొచ్చు. ఇలాంటి పాపాలు మనం ప్రభువులో ఎదగటాన్ని ఆపేస్తాయి. మన జీవితంలో అసూయ, క్షమించని హృదయం, వంటి పాపాలను తొలగించినప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితం కూడా అందంగా వికసిస్తుంది. మనము మిగతావారికి ఆశీర్వాదముగా మారుతాం.

 

దేవుడు మనలను అధికమైన ఫలాలను పలించుటకు పిలిచాడు. ప్రతి రోజు మనం మన జీవితం నుండి ఫలించటానికి ఆటంకంగా ఉన్న వాటిని తొలగించడానికి ప్రయత్నిద్దాం. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన బలంతోనే ఇది చేయడం సాధ్యం కాదు. మనకు పవిత్రాత్మ యొక్క శక్తి అవసరం.

 

యేసు శిష్యుడైన పేతురు జీవితంలో కూడా కొన్ని రాళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది. తన స్వంత బలంపై ఆధారపడటం మరియు ముందు నుంచి ఊహించుకున్న విధంగా కొన్ని పనులు చేయడం అతని రాళ్లు. అతను అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. కానీ అతను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన రోజు విజయవంతమైన జీవితాన్ని గడిపాడు. అప్పటి నుంచి అతను తనపై ఆధారపడలేదు, దేవుని శక్తిపై ఆధారపడ్డాడు.

 

మీరు ఇంకా పవిత్రాత్మ యొక్క సంపూర్ణ అభిషేకాన్ని పొందలేదా? అయితే, ఈ రోజు ఆ ప్రభువును అడగండి. అడిగేవారు అందరూ పొందుతారు. పరిశుద్ధాత్మ మన బలంతో చేయలేని వాటిని చేయిస్తాడు, మనను ఫలవంతులుగా చేయును. ఇది మన శ్రమలతో కూడిన సహకారం ద్వారా జరుగుతుంది. అవును, మన జీవితంలోని రాళ్లను పరిశుద్ధాత్మ సహాయంతో తొలగిద్దాం. ప్రభువు మనకు ఆశీర్వాదంగా ఉండి, మిగతావారికి ఆశీర్వాదకరముగా మార్చుతాడు.

- శ్రీమతి. విమల అబ్రహాం గారు

 

ప్రార్థనా అంశం:

మన రాగ్లాండ్ బైబిల్ కాలేజ్‌లో చదువుతున్న పిల్లలు బలమైన ఆయుధాలుగా మారేలా ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet