Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.01.2025
Share:

By Village Missionary Movement

Sunday, 19-Jan-2025

దిన ధ్యానము(Telugu) 19.01.2025

 

అంశం: యేసును మొదటి స్థానంలో ఉంచండి

 

ప్రత్యేక హోద చిన్న పిల్లల కొరకు

 

“యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి” - కీర్తనలు 105:4

 

నా ప్రియమైన చిన్నారులారా! మీరు దేనిని ఎక్కువగా ప్రేమిస్తారు? యేసయ్యనా? లేదా ఈ లోకాన్నా? అది ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? అర్థం కాలేదా? సరి, ఈ కథ ద్వారా తెలుసుకుందాం.

 

ఒక యువకుడైన ఎరిక్ లిడెల్, చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో విజయాలను సాధించి, తర్వాత చైనాకు మిషనరీగా వెళ్ళాడు. అతని విజయాలకు కారణం ఏమిటో మీకు తెలుసా? చిన్నప్పటినుంచి అతను యేసును మొదటి స్థానంలో ఉంచేవాడు. మీకు తెలుసా అతను ఏం చేసేవాడో? ఆదివారమంటే ఏదైనా ముఖ్యమైన క్రీడా పోటీలు లేదా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నా, అతను ముందుగా యేసుకి ప్రాధాన్యత ఇస్తూ దేవాలయానికి వెళ్ళేవాడు. ఎరిక్ యేసును సంతోషపెట్టడానికే తన శక్తిని వినియోగించేవాడు.

 

1924 లో పారిస్, ఫ్రాన్స్‌లో జరిగిన ఒలింపిక్ క్రీడలలో 100 మీటర్ల పందెం కోసం ఎరిక్ ఎంతో ఆతురతగా ఎదురుచూసేవాడు. కానీ ఆదివారం పందెం పడింది. ఆ రోజు దేవాలయానికి వెళ్ళాల్సినరోజు. ఇప్పుడు ఎరిక్ ముందు ఒక పెద్ద ఆందోళన. లోకములో గౌరవమా? లేక యేసును మొదట ఉంచి ఆయన ఆజ్ఞకు విధేయత చూపించడమా? అతని మనసులో యుద్ధం జరిగింది. మీరైతే ఏం చేసేవారు? ఎరిక్ ఏం చేసాడో మీకు తెలుసా? యేసు సంతోషం తన సంతోషం కంటే ముఖ్యమని భావించి, ఆదివారం దేవాలయానికి వెళ్లాడు. ఆ పోటీలో పాల్గొనలేదు. అందరూ అతనిని ఎగతాళి చేసారు. కొంతమంది మంచి అవకాశాన్ని కోల్పోయావని సలహా ఇచ్చారు. కానీ ఎరిక్ తన నిర్ణయానికి కట్టుబడి నిలిచాడు.

 

ఆదివారానికి మరుసటి రోజున దేవుడు అతనికి కొత్త మార్గం కల్పించారు. 400 మీటర్ల పందెంలో ఎరిక్ స్వర్ణ పతకం గెలిచాడు మరియు ప్రపంచ రికార్డు సృష్టించాడు. యేసును మొదటి స్థానంలో ఉంచినందుకు అతనికి వచ్చిన ఆశీర్వాదాలను అందరూ చూశారు కదు?.

 

తర్వాత దేవుని కోసం సంపూర్ణ కాల మిషనరీగా పనిచేసి, ఎంతో మంది యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించుటకు కారకుడయ్యాడు. ఆయన ప్రేమను, ఆజ్ఞ పట్ల విధేయత ద్వారా పొందిన విజయాన్ని ఎరిక్ అందరితో పంచుకున్నాడు.

 

ప్రియమైన పిల్లలారా! బ్రదర్ ఎరిక్ యేసును మొదటి స్థానంలో ఉంచినందున, ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. మీరూ "నా మొదటి ప్రాధాన్యత యేసు" అని నిశ్చయించుకోండి. గొప్ప ఆశీర్వాదాలు మీ జీవితంలోకు వస్తాయి. మీరు సిద్ధంగా ఉన్నారా, నా ముద్దుల పిల్లలారా?

- శ్రీమతి. ప్రిస్కిల్లా థియోఫిలస్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al