Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.01.2025
Share:

By Village Missionary Movement

Saturday, 18-Jan-2025

దిన ధ్యానము(Telugu) 18.01.2025

 

అంశం: విసర్జించండి

 

"కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి" - యోనా 1:5

 

ఇద్దరు స్నేహితులు పాఠశాల నుంచి కాలేజీ వరకు కలిసి చదివారు. తర్వాత ఉద్యోగం కారణంగా విడిపోయారు. ఒకరోజు, ఆ ఇద్దరిలో ఒకరు, "స్నేహితుడా! నీ ఇంటికి వస్తున్నాను" అని చెప్పారు. "అయ్యో! నా స్నేహితుడు వస్తున్నాడు, కానీ నా ఇంట్లో ఓక చచ్చిన ఎలుక దుర్వాసన వస్తోంది!" అని ఆలోచించాడు. ఎక్కడ ఉందో అని వెతికాడు, కానీ దాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇంట్లో ఎక్కడ చూసినా అదే దుర్వాసన. ఏం చేయాలో తెలీకపోయి, రూమ్ స్ప్రే (సుగంధ ద్రవం) పిచికారి చేశాడు. వెంటనే ఇంట్లో సువాసన అలుముకుంది. అతని స్నేహితుడు వచ్చాడు, ఇద్దరూ పాత జ్ఞాపకాలు మాట్లాడుకుంటున్నారు. కానీ కొంత సమయం గడిచిన తర్వాత మళ్లీ దుర్వాసన మొదలైంది. స్నేహితుడు సహించలేక, "స్నేహితుడా, నేను వెళ్తున్నాను" అని వెళ్లిపోయాడు.

 

ఇక్కడ యోనా దేవుని మాటకు (ఆజ్ఞ) అవిధేయత చూపి, నినెవే వెళ్లాల్సింది పోయి తర్షీషుకు పోయే ఓడ ఎక్కాడు. దీనిని గమనించిన దేవుడు సముద్రంపై గొప్ప గాలి పంపించాడు. వెంటనే సముద్రంలో గొప్ప అలలు ఎగిశాయి, బలమైన గాలి ఓడను ముందుకు సాగనీయలేదు. నౌకలో ప్రయాణిస్తున్న ప్రజలు తమ తమ దేవతలను పిలిచారు, కానీ ఫలితం లేదు. నౌకలో ఉన్న సామాన్లు సముద్రంలోకి విసిరివేశారు, కానీ ఉపయోగం లేదు. చివరకు విచారణ చేసి ఇలా జరుగుటకు యోనా కారణం అని తెలుసుకొని, యోనాను సముద్రంలోకి విసిరివేశారు. అప్పుడు ఓడ ప్రశాంతంగా తన ప్రయాణాన్ని కొనసాగించింది. విసిరివేయాల్సింది సామాను కాదు, యోనానే.

 

ప్రియమైన దేవుని ప్రజలారా! మనకు కనిపించే కష్టాలు, సమస్యల కారణాలు తెలియకుండా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. శాంతి, ఆనందం, ప్రశాంతత, ఆశీర్వాదాలు ఎందుకు ప్రభావితం అవుతున్నాయి? మనం దేవుని ముందు నమ్రతతో అర్పించి, సమస్యల కారణాలను గుర్తించి, వాటిని విసర్జించాలి. అలా చేయకపోతే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొందుతాము, అది శాశ్వతం కాదు. దుర్వాసనను తొలగించడానికి సువాసన కల్పించవచ్చు, కానీ అది తాత్కాలికమే. దుర్వాసన మళ్లీ వస్తుంది.

 

మన కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఉన్నాయా? పరిశీలించి సరిదిద్దుకుందాం. అవసరం లేని వాటిని విసర్జించుకుందాం. శాశ్వతమైన మనశ్శాంతి పొందుదాం! ప్రభువు మనలను ఆశీర్వదించుగాక! ఆమేన్!

- సిస్టర్. ఎప్సిబా ఇమ్మానుయేలు గారు.

 

ప్రార్థనా అంశం:

50 కొత్త ప్రదేశాల్లో ఉపాధ్యాయ కేంద్రాలు ప్రారంభం కావాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al