Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.01.2025
Share:

By Village Missionary Movement

Friday, 17-Jan-2025

దిన ధ్యానము(Telugu) 17.01.2025

 

అంశం: సంస్కరణ

 

"నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి" - యిర్మియా 7:3

 

18వ శతాబ్దం వరకు న్యూ హెబ్రిడ్స్ ద్వీపాలలో నివసించిన ప్రజలు మానవ మాంసాన్ని భక్షించే అలవాటులో ఉన్నారు. ఆ ద్వీపానికి వెళ్లి సువార్తను బోధించేందుకు ఎవ్వరూ ధైర్యం చేయలేకపోయారు. స్కాట్లాండ్‌కు చెందిన ఒక యువకుడు జాన్ పాటన్ ప్రభువు దీవెనలతో ఆ ద్వీపానికి వెళ్లేందుకు సంకల్పించాడు. ఈ మార్గం కఠినమైనది. అతని జీవితం ప్రమాదంలో పడుతుంది అని ఇతరులు హెచ్చరించినప్పటికీ, (narrow gate) సంకుచిత ద్వారం ద్వారా వెళ్ళడం అవసరం అని భావించిన జాన్ పాటన్ 1858లో న్యూ హెబ్రిడ్స్ ద్వీపాలకు ప్రయాణించాడు. అక్కడి ప్రజలు అతనిని అనేక విధాలుగా హింసించారు. అయితే, దేవుని రక్షణలో అతనికి ఏ హాని కలుగలేదు. చివరికి పాటన్ ద్వారా ఆ ప్రాంత ప్రజలు క్రీస్తు గురించి తెలుసుకున్నారు. అతను వారికి విద్యా పరిజ్ఞానాలను అందించడంతోపాటు, 1899లో అనివా భాషలో కొత్త నిబంధనను అనువదించి ప్రచురించాడు. అనేక మంది పశ్చాత్తాపం చెందుతూ క్రీస్తును స్వీకరించినదాన్ని తన కళ్లారా చూసిన తరువాత, 83 సంవత్సరాల వయసులో 1909లో పాటన్ ప్రభువునందు నిద్రించాడు.

 

బైబిల్లో, దేవుడు యోనా ప్రవక్త ద్వారా నినేవే నగర ప్రజలను రక్షించమని ఆజ్ఞాపించాడు. నినేవే ప్రజల దుర్మార్గాలని దేవుని దృష్టికి చేరుకున్నవి. దేవుడు వారి పాపములను యోనా ప్రవక్త ద్వారా వెల్లడించి, వారు తమ మార్గములను మరియు క్రియలను సరిదిద్దుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. వారు తమ పాపములను గ్రహించి, పశ్చాత్తాపం చెందారు. కేవలం బూడిదలో కూర్చుకోవడమే కాక, తమ మార్గములను సరిదిద్దుకున్నారు.

 

ప్రియమైన పాఠకుడా! సమయం వేగంగా గడుస్తోంది. మరో కొత్త సంవత్సరం పుట్టింది. మనలను సరిదిద్దుకొనేందుకు దేవుని ఆత్మ మన హృదయముతో అనేక సార్లు ప్రయత్నిస్తుంది. మనం అనేక సార్లు దేవుని స్వరాన్ని వినినా, మనం ఇంకా మన స్వంత హృదయపు మార్గంలో నడుస్తూ ఉన్నామా? ఈ రోజు మనలను తాము పరిశీలించుకుందాం. మన మార్గములను మరియు క్రియలను దేవుని సమక్షంలో సమర్పించి, ఆయనపై నమ్మకం ఉంచితే, మన వ్యవహారాలు తప్పకుండా మెరుగుపడతాయి. అందుకు మన జీవితంలో మెరుగుదల అవసరమై ఉన్న చోట్ల దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం.

- మణిదేవి రూబీ అరుణ గారు

 

ప్రార్థనా అంశం:

మన క్యాంపస్‌లో ఉన్న ట్యూషన్ సెంటర్ కోసం ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al